పది ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 5.52లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. సెక్రటరియేట్ లోని డీ బ్లాక్ లో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి విడుదల చేశారు.
రెగ్యులర్ విద్యార్థుల్లో 92.43 ఉత్తీర్ణత శాతం ఉంది.

బాలురు : 91.18 శాతం
బాలికలు: 93.68శాతం

రెగ్యులర్ విద్యార్థుల్లో జగిత్యాల (99.73) జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ (83.09) చివరగా నిలిచింది.

జూన్ 10 నుంచి 24 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు అప్లయ్ చేసుకోడానికి ఈనెల 27 వరకూ గడువు ఉంది.