11.30 గంటలకు టెన్త్ ఫలితాలు

పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ 11.30 గంటలకు విడుదలవుతాయి. సెక్రటరియేట్ లోని డీ బ్లాక్ లో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి రిజల్ట్స్ విడుదల చేస్తారు. తర్వాత వాటిని ఈ కింద పేర్కొన్న ప్రభుత్వ వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తారు.
స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్స్ ఫలితాలను చూడటానికి వీలుగ ప్రతి స్కూల్ కి ఓ లాగిన్ ఇస్తారు. విద్యార్థులు తమ స్కూళ్ళల్లో కూడా టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈసారి విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ TSSSCBOARD పేరుతో యాప్ రూపొందించింది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని విద్యార్థి రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన లాగిన్ అవ్వొచ్చు. ఇందులో కూడా ఫలితాలు వెల్లడి అవుతాయి.

వెబ్ సైట్స్:
http://www.bse.telangana.gov.in
http://results.cgg.gov.in