Month: September 2019

మంత్రుల యాక్టివ్… జిల్లాల్లో టూర్లేస్తున్న అమాత్యులు !

మంత్రుల యాక్టివ్… జిల్లాల్లో టూర్లేస్తున్న అమాత్యులు !

News
హమ్మయ్య... రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రభుత్వంలో కాస్త కదలిక కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో పాటు 18 మంది కేబినెట్ టీమ్ ఉండటంతో... ఇప్పుడు జిల్లాల్లో బిజీ బిజీ అయ్యారు. కేసీఆర్ ఫస్ట్ టర్మ్ కేబినెట్ లో మంత్రులు చాలా యాక్టివ్ గా ఉండేవారు. జిల్లాల్లో తిరుగుతూ.... నిత్యం ప్రజల్లో ఉండటమే కాదు... అధికారులతో తరుచుగా సమీక్షలు జరుపుతుండే వారు. కానీ సెకండ్ టర్మ్ లో బాధ్యతలు చేపట్టిన మంత్రులు జిల్లాల్లో పెద్దగా తిరిగింది లేదు... అధికారులతో సమీక్షలు జరిపినట్టు కూడా కనిపించలేదు. మొన్న మొన్నటి దాకా అసలు రాష్ట్రంలో మంత్రి వర్గం ఉందా అన్న విమర్శలు కూడా వచ్చాయి. కేబినెట్ లోకి తాజాగా కేటీఆర్, హరీష్ రావు రావడంతో మిగతా మంత్రులకు కాస్త ఉత్సాహం వచ్చినట్టయింది. కొత్త అమాత్యులుగా బాధ్యతలు చేపట్టిన తెల్లారే... కేటీఆర్ GHMC లో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఫస్ట్ టైమ్ మినిస్టర్ అయిన పువ్వాడ అజయ్ ... ఖైరతాబాద్ ఆర
యాదాద్రి స్థంభాలపై రాజకీయ చిత్రాలా ?

యాదాద్రి స్థంభాలపై రాజకీయ చిత్రాలా ?

News
దేవాలయాల్లో దేవుడి చిత్రాలు, వారి సేవలో తరించిన బంట్లు, ఇతర ముఖ్యమైన దేవతా మూర్తుల చిత్రాలను చెక్కడం అనేది మనం అనాది నుంచి చూస్తున్న సంప్రదాయం. కానీ టీఆర్ఎస్ సర్కార్ లో సీన్ మారింది. పవిత్ర యాదాద్రి ఆలయంలో కేసీఆర్ ముఖచిత్రం, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన హరితహారం, కేసీఆర్ కిట్ బొమ్మలను చెక్కారు. యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ కృష్ణ శిలతో నిర్మిస్తున్న అష్టభుజి ప్రాకారం స్థంభాలపై ఈ చిత్రాలను చెక్కారు. వీటిల్లో చార్మినార్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా చెక్కారు శిల్పులు. రాజుల కాలంలో కూడా ఏ రాజూ దేవాలయాలపై తమ చిత్రాలను చెక్కించుకోలేదు. ఆఖరికి అద్భుతమైన శిల్పకళా సంపదను తెలంగాణ ప్రాంతానికి అందించిన కాకతీయులు కూడా తమ చిత్రాలను ఏ గుడిపైనా చర్చించిన దాఖలాల్లేవు. అయితే మరి కేసీఆర్ చిత్రాలు చెక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది... ఎవరికి వచ్చింది... అనేది అర్థం కాని
రైతుల బాధలు ఎవరికీ పట్టవ్ !

రైతుల బాధలు ఎవరికీ పట్టవ్ !

News
తెలంగాణలో రైతులు అరిగోస పడుతున్నారు. మొన్నటి దాకా వర్షాల్లేవు. వర్షాలు పడ్డాక నాట్లు వేసుకొని... ఇప్పుడు ఎరువుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్, TDP ప్రభుత్వాల్లో రైతుల క్యూలైన్లు, చెప్పులు, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టడం లాంటి సంఘటనలు అనేకం కనిపించాయి. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ... మా హయాంలో రైతులకు రాజవైభోగమే అని చెప్పింది. క్యూలైన్లు ఇప్పుడు కనిపిస్తున్నాయా... అని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా చాలా సార్లు గొప్పగా చెప్పుకున్నారు. ఇవన్నీ ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ లో గొప్పగా చెప్పుకున్నవి. విద్యార్థులు, ఉద్యోగుల్లో ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా... రైతుల సపోర్ట్ ఫుల్లుగా ఉండటంతో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయన్న విమర్శలున్నాయి.. టీఆర్ఎస్ పార్టీ గొప
టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ ల గానా భజానా !

టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ ల గానా భజానా !

సినిమాలు
టీవీ9 ల కొత్తగా ఇస్మార్ట్ న్యూస్ షురువైంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది అంత స్పెషల్ న్యూస్ ఎందుకని అనుకోవచ్చు... ఎందుకంటే... ఇందుల V6 ల ఫేమస్ అయిన బిత్తిరి సత్తి... అలియాస్ రవి ఉన్నడు. వీ6ల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నరని TV9 కి పోయిండు. అందుకే జనం అక్కడెట్ల చేస్తున్నడో చూద్దం అనుకున్నరు. ఆ క్రేజ్ క్యాష్ చేసుకుందమని టీవీ 9 వాళ్ళు... దీప్తి వాజ్ పేయితోటి ముందగాల పరిచయ కార్యక్రమం కూడా పెట్టిన్రు. ఎట్లుంది... ఎట్లుంటది... సత్తి వాయిస్ అక్కడ ఇమిటేట్ చేయడానికి కుదరదాయే. అందుకే... రవి కాస్త తేడాగా మాట్లాడిండు... దాంతో ఈ క్యారెక్టర్ ఏదో తేడా క్యారక్టర్ అనుకుంట అని అందరూ ఫిక్స్ అయిపోయిన్రు. సర్లే తొమ్మిదిన్నరకి వస్తది కదా... ప్రోగ్రామ్ చూద్దం లే అనుకున్నరు. అక్కడి నుంచి వెయిట్ చేసి... తొమ్మిదిన్నరకి టీవీ9 పెట్టుకొని చూసిన్రు... యాంకరమ్
రాష్ట్ర బీజేపీల లొల్లి షురూ ! వర్గ విభేదాలకు చెక్ పెట్టేదెవరు ?

రాష్ట్ర బీజేపీల లొల్లి షురూ ! వర్గ విభేదాలకు చెక్ పెట్టేదెవరు ?

News
రాష్ట్ర బీజేపీల మళ్లీ లొల్లి షురూ అయింది. వర్గ పోరు మళ్లా మొదలైంది. ఇంతకుముందు బీజేపీ రాష్ట్రంలో నిలదొక్కుకోలేక పోవడానికి కారణం కూడా ఇదే చెబుతారు చాలామంది సీనియర్లు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సెకండ్ ప్లేసులో ఉన్న బీజేపీ ఆ తర్వాత దిగజారుతూ వచ్చింది. టౌన్లల్లో మంచి మెజార్టీ ఓట్లు ఆ పార్టీకే పడేవి. ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకొని పార్టీని సర్వనాశనం చేశారని ఇప్పటికీ చాలామంది RSS, బీజేపీ సీనియర్లు చెబుతుంటారు. అప్పట్లో ఈ వర్గపోరు తారా స్థాయిలో ఉండేది. మేం గొప్ప అంటే మేం గొప్ప అన్నట్టుగా కమలనాధులు కలహించుకునేవారు. రాష్ట్ర స్థాయిలో రెండు, మూడు వర్గాలుంటే వాటికి అనుబంధంగా జిల్లా స్థాయి దాకా ఈ వర్గపోరు కంటిన్యూ అయ్యేది. దాంతో బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా నాయకులే చేశారని అంటుంటారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. అట్లనే రాష్ట
దత్తన్నకి గవర్నర్ గిరి – తెలంగాణకి కొత్త గవర్నర్

దత్తన్నకి గవర్నర్ గిరి – తెలంగాణకి కొత్త గవర్నర్

News
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. ఎన్నాళ్ళుగానో గవర్నర్ పదవి కోసం ఎదురు చూస్తున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు ఎట్టకేలకు పదవి దక్కింది. ఆయన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్రమోడీ ఫస్ట్ టర్మ్ లో కేంద్ర మంత్రిగా పనిచేసి పదవీత్యుడైన దత్తన్నకు ఆ తర్వాత వయో భారం కారణంతో సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ను కూడా బీజేపీ అధిష్టానం కేటాయించలేదు. దాంతో దత్తన్న పార్టీ కార్యక్రమాలకే పరిమితం అయ్యారు. బీజేపీ సభ్యత్వ నమోదులో ప్రస్తుతం చురుకుగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకి తిరుగుతూ కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దత్తన్న చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం ఆయనకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పదవి ఇచ్చింది. ఇక రాష్ట్రంలో గవర్నర్ గిరీ కోసం ఎదురు చూస్తున్న ఇంద్రసేనా రెడ్డికి ఈసారి స్థానం దక్కలేదు. తెలంగాణకి సౌందర రాజన్