మీ వాయిస్ రికార్డింగ్స్ వింటున్నారు !

అమెజాన్ ప్రవేశపెట్టిన అలెక్సా రికార్డింగ్స్ ను వేరేవాళ్ళు కూడా వింటున్నారని మీకు తెలుసా ? మీరు మీకు ఇష్టమైన వాటిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోడానికి… సంభాషించడానికి అలెక్సాను వాడుతున్నారు. అలెక్సాతో ఎన్నో పనులు చేయించుకుంటున్నారు. ఇవన్నీ రికార్డు చేస్తున్న అమెజాన్ ఉద్యోగాలు వాటిని వింటున్నారట. ఈ వాయిస్ రికార్డింగ్స్ వినడానికి ఓ డెడికేటెడ్ ఎంప్లాయీస్ టీమ్ పనిచేస్తోందట. ఈ విషయాన్ని బ్లూమ్ బెర్గ్ సంస్థ బయటపెట్టింది.  అలెక్సా సేవలు భారత్ తో పాటు బోస్టన్, కోస్టారికా, రొమేనియాల్లో అందుబాటులో ఉన్నాయి.

అవును… కస్టమర్స్ వాయిస్ రికార్డింగ్స్ వింటున్న మాట కరెక్టేనని అమెజాన్ కూడా ఒప్పుకుంటోంది. అయితే ఇవన్నీ తమ ప్రొడక్ట్ ఇంప్రూవ్ మెంట్ కోసమే అంటోంది. అంటే అలెక్సా సాఫ్ట్ వేర్ ఎంతవరకు పనిచేస్తోంది. ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కస్టమర్స్ ఆదేశాలన్నీ అలెక్సా సరిగా గ్రహిస్తుందా… లేదా… తెలుసుకోడానికి మాత్రమే ఈ రికార్డింగ్స్ వింటున్నామని చెబుతోంది.  ఈ క్వాలిటీ చెక్ తో సాఫ్ట్ వేర్ ను మరింత మెరుగ్గా తయారు చేస్తామంటోంటి అమెజాన్.   అంతేకాదు… అమెజాన్ ఉద్యోగులు… ఎవరి ఖాతానైనా ఓపెన్ చేసి…. వాళ్ళ అలెక్సా రికార్డింగ్స్ నేరుగా  వినే ఛాన్స్ లేదని చెబుతోంది. తమ వినియోగదారుల ప్రైవసీకి ఏ మాత్రం భంగం కలిగించబోమంటోంది అమెజాన్. కస్టమర్ల వాయిస్ రికార్డింగ్స్ సీక్రెట్ గానే ఉంచుతామని భరోసా ఇస్తోంది.