రేపటి ఏపీ కేబినెట్ కి ఈసీ ఓకే !

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశానికి ఈసీ అంగీకరించింది. CMO రూపొందించిన ఎజెండాను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. CS ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ కేబినెట్ ఎజెండాలోని నాలుగు అంశాలను ఈసీ దృష్టికి తీసుకొచ్చింది.

రాష్ట్రంలో ఫొనీ తుఫాన్ ప్రభావం – తీసుకోవాల్సిన చర్యలు, ఎండాకాలం కావడంతో ఏపీలో కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు అలాగే ఉపాధి హామీ పనులకు నిధులు చెల్లించడం అంశాలను ఏపీ కేబినెట్ అత్యవసరంగా చర్చించాల్సి ఉందని ప్రభుత్వం భావించింది. ఈసీ ఆమోదించడంతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అవుతోంది.