ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఇప్పుడే కాదు

దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా మోక్షం లభించలేదు. ఎన్నికల కోడ్ పూర్తయ్యేదాకా కేంద్ర ఎన్నికల సంఘం విడుదలకు బ్రేకులు వేసింది. ఆ ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక… బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు అనేక భాషలకు చెందిన బయోపిక్స్ పై వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పాటు మోడీ బయోపిక్ ప్రదర్శనను కూడా ఈసీ నిలిపేసింది. మే1 ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు అనుమతి ఇవ్వాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేదాకా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కుదరదని ఈసీ ద్వివేది స్పష్టం చేశారు. సో… మే 23 తర్వాతే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యే ఛాన్సుంది.