ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 5 గంటల దాకా పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 46 వేల 120 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2118 మంది, 25 లోక్ సభ సీట్లకి 319 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.

ఓటర్లు తమ పోలింగ్ స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు లేదా కమిషన్ గుర్తించిన ఇతర 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా తమ వెంట తీసుకెళ్ళి ఓటు వేయవచ్చు.
పోలింగ్ కేంద్రాల్లో మొబైల్స్ తీసుకెళ్ళడానికి అనుమతి లేదు.

ఈ కింద పిక్ లో పేర్కొన్నవాటిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావొద్దని ఎన్నికల అధికారుల సూచిస్తున్నారు.