ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ మాయం !

సమస్త వెన్ను సమస్యలకు … అనగా మన్య స్థంభనవాతం ( సర్వైకల్ స్పాండిలైటిస్ ) పూర్తి నివారణకు మహా భైరవాద్రి చూర్ణం.

100 గ్రాములు గోక్షురాది చూర్ణం ( చిన్న పల్లేరు కాయల చూర్ణం)

100 గ్రాములు తెల్ల గలిజేరు చూర్ణం (పునర్నవ )

100 గ్రాములు అతి మధుర చూర్ణం

100 గ్రామలు అశ్వగంధాది చూర్ణం

100 గ్రాములు వాయు విడంగాల చూర్ణం

100 గ్రాములు నాగ కేశరాల చూర్ణం

ఈ ఆరు చూర్ణాలు కలిపి, సీసాలో పోసుకోవాలి. రోజు ఉదయం పరిగడుపున ఒక చెంచా మోతాదుగా 3 చెంచాలు తేనె కలిపి సేవించాలి. అలాగే సాయంత్రం కూడా సేవించాలి.

ఏవి తినకూడదు ?

గడ్డ కూరలు, మాంసం, చేపలు, గుడ్లు, వంకాయ, గోంగూర, గుమ్మడి కాయ, పెరుగు, చింతపండు పూర్తి నిషేధం.

పై ఔషధం వాడుతూ త్రిఫల చూర్ణం రాత్రి పూట ఒక గ్లాసు గోరు వెచ్చని నీటితో కలిపి సేవించాలి. ఈ కింది తైలంతో వెన్ను భాగం మర్ధన చేసుకోవాలి. ఒక పావు కేజీ వామును రోట్లో గానీ, మిక్సీలో గానీ వేసి కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ దంచుకుంటూ రసం తీయాలి. ఆ రసం పావుసేరు వస్తే అందులో పావు కేజీ నల్ల నువ్వుల నూనె పోసి … నూనె మిగిలేవరకూ సన్నటి మంట మీద కాచి వడపోసి సీసాలో పోసుకోవాలి. ఇదే వాము తైలం. ఈ తైలాన్ని రోజూ 3 సార్లు వెన్ను భాగానికి, మెడ భాగానికి స్పాండిలైటిస్ పూర్తిగా నివారణ అవుతుంది.

ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు :

GVM Sharma, ఆయుర్వేద కార్యకర్త,

 శ్రీ భరద్వాజ మహర్షి ఆయుర్వేద ఔషధాలయం,

ఖమ్మం. 9441877485 )