బాసరలో అక్షయ తృతీయ రద్దీ

నిర్మల్ జిల్లా: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు – అక్షయ తృతీయ సందర్భంగా బాసర మండలంలో రైతుల ఆధ్వర్యంలో 85 జంటలచే అరక పూజలు చేయించారు. విత్తనాలకు ప్రత్యేక పూజలు చేసి సామూహికంగా దుక్కి దున్నారు రైతులు.