BSNL ఉగాది కానుక !

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్( బీఎస్ఎన్ఎల్) ఉగాది కానుకగా కొత్త ఆఫర్లు ప్రకటించింది. ప్రీ పెయిడ్ మొబైల్ కు సంబంధించి మూడు కొత్త ప్లాన్స్ వెల్లడించింది

రూ.1312 ప్లాన్ లో ఏడాది వరకూ పూర్తి అపరిమిత కాల్ సౌకర్యం, రోమింగ్ వాయిస్ కాల్ తో పాటు 5జిబి డేటా, వెయ్యి SMSలు, ఫ్రీకాలర్ ట్యూన్ ఉంటుంది.

రూ.899 ప్లాన్ ప్రకారం 180 రోజుల సౌకర్యం తో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ రోజుకు 50 ఎస్ యంఎస్ లు ఫ్రీ అని తెలిపారు.

రూ.599 ప్లాన్ ద్వారా 180 రోజులకి అపరిమిత లోకల్,ఎస్టీడీ,రోమింగ్ వాయిస్ కాల్స్ అందిస్తున్నారు.

గతంలో ఉన్న టాప్ అప్ 90 ,190 పైన పూర్తి టాక్ టైంను 500, 600, 160ల పై 10% అదనంగా టాక్ టైం ను ఈ నెల 7 వరకు అందిస్తామని ప్రకటించింది BSNL.

ఇక ల్యాండ్ లైన్ ఖాతాదారులకు ఆఫర్ కింద ఈ నెల 30 వరకు ఒక నెల బ్రాండ్ బ్యాండ్ ఫ్రీగా ఇస్తున్నారు. బ్రాండ్ బ్యాండ్ నచ్చినవాళ్లు తర్వాత కొనసాగించవచ్చు లేదంటే వేరే ప్లాన్ కు మార్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 4G సర్వీసులు విస్తృతం చేశారు. అందుకోసం 46 స్టేషన్లను 141 టవర్స్, 342 3G టవర్లను ఏర్పాటు చేశారు.