కారు, టూవీలర్ కి వెంటనే రుణాలు

కారు, టూ వీలర్ ఏది కావాలంటే అది కొనుక్కోండి… మీకు వెంటనే లోన్ ఇస్తామంటోంది ICICI బ్యాంక్. ప్రస్తుతం తమ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి వెంటనే లోన్ శాంక్షన్ లెటర్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. Insta Auto Loan పేరుతో 20 లక్షలకు పైగా Pre-Approved వినియోగదారులకు కారు రుణం వెంటనే మంజూరు చేస్తుంది ICICI. ఏడేళ్ళ కాలపరమితితో రూ.20 లక్షల వరకూ లోన్ ఇస్తారు. ఇక Insta Two wheeler Loan కూడా 1.20 కోట్ల మంది Pre-approved వినియోగదారులకు వర్తిస్తుంది. దీని కింద 3యేళ్ళ వ్యవధితో రూ.2 లక్షల వరకూ లోన్ ఇస్తారు. ఈ రెండు పథకాల్లోనూ వెహికిల్ ఆన్ రోడ్ ధరపై 100శాతం రుణం ఇస్తున్నట్టు ICICI ప్రకటించింది. అంటే ముందస్తు పేమెంట్స్ లేకుండానే రుణం తీసుకునే అవకాశముంది.