ఆరోగ్యం

తల బాధలు ఇలా తప్పుతాయ్ !

తల బాధలు ఇలా తప్పుతాయ్ !

ఆరోగ్యం
తలకు సంబంధించిన నుదురు నొప్పి, కన్ను బొమ్మల నొప్పి, మాడు నొప్పి, మెడ నొప్పి, తలలో వాయు భారం, శ్లేష్మ భారం తగ్గిపోయి శిరస్సు ఆరోగ్యవంతంగా మారుటకు శిరో మంజరి రసాయనం. ఇది భార్గవ మహాముని ప్రయోగంగా చెబుతారు. తయారు చేసుకునే విధానం శొంఠి పొడి 20 గ్రాములు బెల్లం - 80 గ్రాములు ఆవునెయ్యి -80 గ్రాములు స్వచ్ఛమైన పాలు - 320 గ్రాములు ఒక పాత్రలో అన్ని పదార్థాలను కలిపి, పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై ఉంచాలి. అందులోని నీళ్ళంతా ఇనికిపోయేదాకా లేత పాకం రాగానే... దించి చల్లార్చి గాజు సీసాలో ఉంచుకోవాలి. ఈ రసాయనాన్ని ఆహారానికి గంట ముందు 10 గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే... పైన చెప్పిన రోగాలన్నీ మటుమాయం అవుతాయి. 21 రోజు ఈ ప్రక్రియ కొనసాగించిన శిరస్సుకు సంబంధించిన వ్యాధులు పూర్తిగా నివారణ అవుతాయి. ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు (తయారు చేసుకోలేని వారికి రెడీ మేడ్ ఔషధాలు దొరుకు చోటు)
ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ మాయం !

ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ మాయం !

ఆరోగ్యం
సమస్త వెన్ను సమస్యలకు ... అనగా మన్య స్థంభనవాతం ( సర్వైకల్ స్పాండిలైటిస్ ) పూర్తి నివారణకు మహా భైరవాద్రి చూర్ణం. 100 గ్రాములు గోక్షురాది చూర్ణం ( చిన్న పల్లేరు కాయల చూర్ణం) 100 గ్రాములు తెల్ల గలిజేరు చూర్ణం (పునర్నవ ) 100 గ్రాములు అతి మధుర చూర్ణం 100 గ్రామలు అశ్వగంధాది చూర్ణం 100 గ్రాములు వాయు విడంగాల చూర్ణం 100 గ్రాములు నాగ కేశరాల చూర్ణం ఈ ఆరు చూర్ణాలు కలిపి, సీసాలో పోసుకోవాలి. రోజు ఉదయం పరిగడుపున ఒక చెంచా మోతాదుగా 3 చెంచాలు తేనె కలిపి సేవించాలి. అలాగే సాయంత్రం కూడా సేవించాలి. ఏవి తినకూడదు ? గడ్డ కూరలు, మాంసం, చేపలు, గుడ్లు, వంకాయ, గోంగూర, గుమ్మడి కాయ, పెరుగు, చింతపండు పూర్తి నిషేధం. పై ఔషధం వాడుతూ త్రిఫల చూర్ణం రాత్రి పూట ఒక గ్లాసు గోరు వెచ్చని నీటితో కలిపి సేవించాలి. ఈ కింది తైలంతో వెన్ను భాగం మర్ధన చేసుకోవాలి. ఒక పావు కేజీ వామును రోట్లో గానీ, మిక్సీలో గానీ వేసి
చెవికి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం

చెవికి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం

ఆరోగ్యం
మహా కర్ణాది తైలం తయారు చేసుకునే విధానం చెవిలో అడ్డుపడ్డ రాయి లాంటి కఫం కరిగిపోయి రక్త నాడులు శుద్ధి అవుతాయి. అంతేకాకుండా చెవి పోటు, చివి నుంచి చీము కారుట, చెవికి సంబంధించిన సమస్య వ్యాధులను ఇది నివారించగలదు. ఇదే మహా కర్ణాది తైలం. ఎలా తయారు చేసుకోవాలి ? నువ్వుల నూనె 25 గ్రాములు ఒక పాత్రలో వేసి... పొయ్యి మీద పెట్టాలి. తర్వాత లేత వేపాకు ఐదు గ్రాములు. నెమల ఈకల మధ్యలో ఉండే కన్ను కత్తిరించి ఆ నూనెలో వేసి... చిన్న మంటపైన ఆ పదార్థాలు నల్లగా మాడేటట్టు అయిన తర్వాత దించి వడపోయాలి. ఈ తైలాన్ని రెండు చెవుల్లో వేస్తూ ఉంటే మనం చెప్పిన చెవిపోటు ఇతర చెవి సంబంధిత సమస్యలు అన్నీ మటుమాయం అవుతాయి. వినికిడి శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ( ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు : GVM Sharma, ఆయుర్వేద కార్యకర్త, ఖమ్మం. 9441877485 )
గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారా ?

గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారా ?

ఆరోగ్యం
ఈమధ్య కాలంలో గ్యాస్ ట్రబుల్ తో చాలామంది బాధ పడుతున్నారు. కడుపులో మంట, పులి త్రేన్పులు, ఆపాన వాయువులు, అన్నం తినాలని అనిపించకపోవడం లాంటి సమస్యలు చాలామందిలో ఉన్నాయి. వీటికి తోడు తలనొప్పి, నిద్ర రాకపోవడం, నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు, నిద్రలో గురక లాంటి సమస్త రోగాలకు ఒక్కటే మందు హరితకి రసాయనం. సమస్త ఉదర సంబంధమైన వ్యాధులకు పనికివచ్చే ఈ హరితకి రసాయనాన్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి ? చిన్న కరక్కాయపొడి - 50 గ్రాములు సోంపు గింజల పొడి - 10 గ్రాములు జీల కర్ర పొడి - 10 గ్రాములు అల్లపు రసం - ఒక చెంచా నిమ్మ రసం - ఒక చెంచా సైంధవ లవణం - 10 గ్రాములు అన్ని పదార్థాలు బాగా కలిపి, దంచి గాలి తగిలే చోట ఆరబెట్టాలి ( రెండు రసాలు తక్కువగా ఉన్నచో 2,3 చెంచాలు ఎక్కువ కలుపుకోవచ్చు ). మరలా దంచి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఎవరికి వారు దాన్ని చిన్న డబ్బాలో దాచుకొని జేబులో పెట్ట
సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి ?

సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి ?

ఆటలు, ఆరోగ్యం
ప్రతిరోజూ ఉదయం చేసే సూర్య నమస్కారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది... ఇందులో ఉండే 12 భంగిమలు మన బరువు తగ్గించుకోడానికి ఉపయోగపడతాయి. ప్రతి రోజూ మీరు నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేస్తే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. సూర్య నమస్కారాలను సాధారణంగా చాలామంది ఇండోర్ లో చేస్తుంటారు. దీనికంటే బయటి ప్రదేశంలో చేయడమే ఉత్తమం. ఎందుకంటే మనకు ఉదయాన్నే వచ్చే ఎండ చాలా ముఖ్యం. ఈ సూర్య రశ్మి నుంచి డి విటమన్ వస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు చాలామందికి ఈ డి విటమన్ తక్కువవుతోంది. నిరంతరం ఏసీ గదుల్లో పనిచేస్తూ, నిద్రిస్తూ ఉండటం వల్ల డి విటమన్ లోపాన్ని నివారించుకోవడం కోసం మందులు వాడాల్సి అవసరం ఏర్పడింది. ఉదయాన్నే సూర్యరశ్మితో ఉచితంగా వచ్చే డీ విటమన్ ని కాదని మందులు వాడటం మనకు అవసరమా ... ఆలోచించండి. డీ విటమన్ తో ఎముకల్లో పటుత్వం ఏర్పడుతుంది. ఒక్క డీ విటమన్ కోసమ