News

దిశ నిందితులు నలుగురు కాల్చివేత

దిశ నిందితులు నలుగురు కాల్చివేత

Breaking News, News, Recent News
అందరూ కోరుకున్నట్టు న్యాయం జరిగింది... దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి... హత్య చేసిన నలుగురు నిందితులను ఇవాళ ఉదయాన్నే కాల్చి చంపారు పోలీసులు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో చటాన్ పల్లిలో సీన్ reconstruction చేస్తుండగా.... నలుగురు నిందితులు పారిపోతుండగా పోలీసులు కాల్చి చంపారు. దిశను బతికుండగానే సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ ను పోలీసులు కాల్చి చంపారు. ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ ఉదయం సీపీ సజ్జనార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు.
ఫార్వార్డ్ చేయడం… నోటికొచ్చిన కామెంట్స్ ! : దిశపై పోస్టులు పెట్టిన యువకుల అరెస్ట్

ఫార్వార్డ్ చేయడం… నోటికొచ్చిన కామెంట్స్ ! : దిశపై పోస్టులు పెట్టిన యువకుల అరెస్ట్

Breaking News, News, Recent News
దిశ సంఘటన మానవులుగా పుట్టిన మనందర్నీ సిగ్గుపడేలా చేసింది. అత్యంత హేయమైన ఈ చర్యపై మహిళలే కాదు అందరూ ముక్త కంఠంతో ఆక్రోశిస్తున్నారు. ఆ నలుగురు నిందితులను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలనీ, దిశను కాల్చినట్టే పెట్రోల్ పోసి తగలపెట్టాలని మండిపడుతున్నారు. నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన రోజున... ఎవరూ చెప్పకుండానే వేల మంది జనం స్వచ్ఛందంగా తరలి వచ్చారు. వీళ్ళల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు... దేశ వ్యాప్తంగా... ప్రపంచమంతటా ఆగ్రహం వ్యక్తమైంది. ఇంత జరుగుతుంటే... సోషల్ మీడియాలో కొందరు కారు కూతలు మొదలుపెట్టారు. దిశతో పాటు... మహిళలు, యువతులపైనా తప్పుడు కామెంట్స్ చేశారు. బుర్రకి ఏది తోస్తే అది అన్నట్టు వాళ్ళ పంథా కొనసాగింది. ఇలాంటి నరరూప రాక్షసులు మన మధ్య తిరుగుతుండబట్టే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలామంది వాళ్ళపై ఫైర్ అయ్యారు. అయితే మనకి స్వేచ్ఛ ఉంది కదా అని..
ఆర్టీసీ కార్మికులంతా రేపు జాయిన్ అవ్వండి : సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

ఆర్టీసీ కార్మికులంతా రేపు జాయిన్ అవ్వండి : సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Breaking News, News, Recent News
ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం 5 గంటల నుంచి జాయిన్ అవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రెస్ మీట్ తర్వాత అరగంటలో ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్డర్స్ ఇస్తాం. అంతేకాకుండా... సోమవారం నుంచే ఛార్జీలు పెంచుకోడానికి అనుమతి ఇస్తున్నామని సీఎం ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా జాయిన్ చేసుకుంటామన్నారు. టికెట్ రేట్లు కిలోమీటర్ కి 20 పైసలు చొప్పున పెంచుకోవచ్చు. ఆర్టీసీ కోసం ప్రత్యేకంగా 100 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు కూడా సీఎం ప్రకటించారు. తెలంగాణ బిడ్డగా, పెద్దన్నగా మిమ్మల్ని కాపాడే బాధ్యత తనకు ఉందని అన్నారు సీఎం కేసీఆర్. యూనియన్లను నమ్మొద్దు :సీఎం ఆర్టీసీ సమ్మెకు యూనియన్లే కారణం. వాళ్ళ వల్లే కార్మికులు అన్యాయం అయ్యారు. విపక్షాలు కూడా వాళ్ళని ప్రోత్సహించారు. ప్రతిపక్షాలతో ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళని బజార్న పడేశారు. ఆర్టీసీ కార్మికులు ఆల్రెడీ ఇల్లీగల్ సమ్మెలో ఉన్నారు. సర్కార్ ఎవరి పొట్టా కొట్టలేదు. లేబర్
టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి (CC TV ఫుటేజ్)

టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి (CC TV ఫుటేజ్)

News, Recent News, వీడియోలు
మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ లోని రాధిక చౌరస్తాలో స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయారు. బుధవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. రాధికా సిగ్నల్ నుంచి ఇంటికి వెళ్తున్న కోలాటి సరిత (35) చనిపోయింది. ఆమె యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ టిప్పర్ ను అక్కడే వదిలి పారిపోవడం సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది.   https://youtu.be/ZEHrYbG-k0M
ఆర్టీసీ బస్సు వస్తోంది జాగ్రత్త !

ఆర్టీసీ బస్సు వస్తోంది జాగ్రత్త !

News, Recent News
ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే సేఫ్ అండ్ సెక్యూర్ జర్నీ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కడమే కాదు... అది రోడ్డు మీద వస్తుందంటేనే భయపడిపోయే రోజులు వచ్చాయి. ఒకటా... రెండా... పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల వల్ల జనం చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టి 2 నెలలు కావొస్తోంది. అప్పటి నుంచి బస్సులను తాత్కాలిక డ్రైవర్ల చేతిలో పెట్టింది ప్రభుత్వం. దాంతో ఊళ్ళో ఇసుక ట్రాక్టర్లు నడిపేవాళ్ళు, స్కూల్ బస్సులు, ఆటోలు, టెంపోలు నడిపేవాళ్ళంతా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అలాగని వాళ్ళని తప్పుబట్టడం లేదు. వీళ్ళల్లో కొందరు అనుభవం కలిగిన డ్రైవర్లే ఉండి ఉండొచ్చు. కానీ చాలామందికి మాత్రం బస్సు నడపడం మీద కనీస అవగాహన కూడా ఉండటం లేదు. మిగతా వాహనాలకీ, బస్సులకు లెఫ్ట్, రైట్, ఫ్రంట్ మార్జిన్స్ ఎలా ఉండాలన్న స్పృహ కూడా లేని డ్రైవర్లు బస్సులు నడుపుతున్నార
ఆర్టీసీ దారెటు ? రాష్ట్ర కేబినెట్ ఏం నిర్ణయిస్తుంది ?

ఆర్టీసీ దారెటు ? రాష్ట్ర కేబినెట్ ఏం నిర్ణయిస్తుంది ?

News, Recent News
తెలంగాణలో ఆర్టీసీ రూట్ ఎలా ఉంటుందన్న దానిపై చర్చ నడుస్తోంది. ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన జేఏసీ... మంగళవారం ఉదయం 6 గంటల నుంచే డ్యూటీలకు హాజరు కావాలని కార్మికులకు సూచించింది. దాంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మికులు బస్ డిపోలకు వెళ్ళారు. కానీ వారికి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకొని అరెస్టులు చేశారు. కనీసం డిపో మేనేజర్లకి తమ అభ్యర్థనా పత్రాలు ఇస్తామన్నా ఒప్పుకోలేదు పోలీసులు. దాంతో చాలామంది మహిళా కండక్టర్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు. 3 నెలలుగా జీతాల్లేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని కాళ్ళా వేళ్ళా పడ్డా డిపోమేనేజర్లు, పోలీసులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. దాంతో రాష్ట్రంలో టీవీలు చూస్తున్న చాలామంది వాళ్ళ దుస్థితి చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇటు హైదరాబాద్ లో మరోసారి ఆర్టీసీపై ఉన్నతస్థాయి మీటింగ్ నిర్వహించారు సీఎం కేసీఆర్. కార్మికులను కనికరిస్తారనీ, ఏదో ఒక ప్రకటన చేస్తా
ఆర్టీసీ సమ్మె విరమించామన్నజేఏసీ; కుదరదంటున్న ఎండీ

ఆర్టీసీ సమ్మె విరమించామన్నజేఏసీ; కుదరదంటున్న ఎండీ

News, Recent News
ఆర్టీసీ సమ్మె మరో ట్విస్ట్ తీసుకుంది. 52 రోజుల సుదీర్ఘ సమ్మె తర్వాత విరమించినట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి విధుల్లోకి చేరుతున్నామనీ... కార్మికులంతా డిపోలకు వెళ్ళాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఆర్టీసీని ప్రైవేటు కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకే సమ్మె విరమిస్తున్నట్టు జేఏసీ తెలిపింది. కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దనీ... ఈ విరమణతో కార్మికులు ఓడిపోయినట్టు కాదని కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. కార్మికులను చేర్చుకోం: సునీల్ శర్మ ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్టు జేఏసీ ప్రకటించిన తర్వాత ఎండీ సునీల్ శర్మ తీవ్రంగా స్పందించారు. మీరే సమ్మెకు వెళ్ళి... ఇప్పుడు మీ ఇష్టమొచ్చినట్టుగా జాయిన్ అవుతామంటే కుదరదని తేల్చి చెప్పారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలప్పుడు సమ్మెలోకి వెళ్ళారు. ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ స
రాత్రికి రాత్రే మారిన మహారాష్ట్ర సమీకరణాలు : బీజేపీ – ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు

రాత్రికి రాత్రే మారిన మహారాష్ట్ర సమీకరణాలు : బీజేపీ – ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు

News
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు ఒక్క రాత్రిలో అనూహ్యంగా మలుపు తిరిగాయి. ఎన్నడూ ఊహించని విధంగా బీజేపీ - ఎన్సీపీ కలసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సైద్ధాంతికంగా విభేదాలున్నప్పటికీ అధికారం కోసం ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. గత రాత్రి బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్, ఎన్సీపీ అజిత్ పవార్ గవర్నర్ తో భేటీ అయ్యారు. దాంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలన్న గవర్నర్ సిఫార్సులను కేంద్రం ఈ ఉదయం కల్లా ఆమోదించింది. ఉదయం 8 గంటలకే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ వెంటనే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. బీజేపీ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఎన్సీపీ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీకి రెండు లేదా మూడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు మోడీ సర్కార్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా... అటు శివసేన, కాంగ్
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఆదేశాలివ్వలేం :హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఆదేశాలివ్వలేం :హైకోర్టు

News
హైకోర్టులో ఇన్నాళ్ళుగా నడుస్తున్న ఆర్టీసీ సమ్మె కేసు కొత్త ట్విస్ట్ తీసుకుంది. సమ్మె కేసు విషయంలో ఇక ముందుకు వెళ్ళలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ... దాన్ని దాటి వెళ్ళలేమన్నది హైకోర్టు. ఇక ఈ వ్యవహారాన్ని లేబర్ కోర్టు చూసుకుంటుందని న్యాయస్థానం తెలిపింది. రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్ కు ఆదేశాలిస్తామంది. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడపడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు ఆర్టీసీ జేఏసీ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ సేవింగ్స్ రూ.1900 కోట్లు వాడుకుంది. పీఎఫ్ డబ్బులు రూ.900 కోట్లు వాడుకుందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే జనం ఇబ్బంది పడుతుంటే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు న్యాయమూర్తి. ప్రభుత్వ తీరుతో కార్మికులు, జనం ఇబ్బంది పడుతున్నార
లింక్ క్లిక్ చేస్తే … డబ్బులు పోయినట్టే !

లింక్ క్లిక్ చేస్తే … డబ్బులు పోయినట్టే !

News
మనిషికి ఆశ ఉంటుంది... కానీ అత్యాస ఉండకూడదు. కానీ చాలామంది మాయగాళ్ళు మనిషికి ఉన్న అత్యాసను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఫోన్లు చేసి OTP నెంబర్లు అడిగి బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేసేవాళ్ళు సైబర్ నేరగాళ్ళు. కానీ జనం అలెర్ట్ అయిన కొద్దీ... ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. కొత్తగా ఆలోచిస్తూ... జనం దగ్గర డబ్బులు ఎలా కొట్టేయ్యాలా... అని ఆలోచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా మొబైల్స్ కి వస్తున్న మెస్సేజ్ లు చూస్తే... గ్యారంటీకి జనం మోసగాళ్ళ వలలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. అదంటేంటే... మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి ఫలానా అమౌంట్ క్రెడిట్ అయింది... చెక్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయమని మెస్సేజ్ వస్తోంది. ఇలాంటివి PF, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, బ్యాంక్ లోన్, క్రాప్ లోన్... ఇలా రక రకాల పేర్లతో మెస్సేజ్ లు పంపుతూ జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ మోసగాళ్ళ