ఆటలు

సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి ?

సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి ?

ఆటలు, ఆరోగ్యం
ప్రతిరోజూ ఉదయం చేసే సూర్య నమస్కారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది... ఇందులో ఉండే 12 భంగిమలు మన బరువు తగ్గించుకోడానికి ఉపయోగపడతాయి. ప్రతి రోజూ మీరు నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేస్తే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. సూర్య నమస్కారాలను సాధారణంగా చాలామంది ఇండోర్ లో చేస్తుంటారు. దీనికంటే బయటి ప్రదేశంలో చేయడమే ఉత్తమం. ఎందుకంటే మనకు ఉదయాన్నే వచ్చే ఎండ చాలా ముఖ్యం. ఈ సూర్య రశ్మి నుంచి డి విటమన్ వస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు చాలామందికి ఈ డి విటమన్ తక్కువవుతోంది. నిరంతరం ఏసీ గదుల్లో పనిచేస్తూ, నిద్రిస్తూ ఉండటం వల్ల డి విటమన్ లోపాన్ని నివారించుకోవడం కోసం మందులు వాడాల్సి అవసరం ఏర్పడింది. ఉదయాన్నే సూర్యరశ్మితో ఉచితంగా వచ్చే డీ విటమన్ ని కాదని మందులు వాడటం మనకు అవసరమా ... ఆలోచించండి. డీ విటమన్ తో ఎముకల్లో పటుత్వం ఏర్పడుతుంది. ఒక్క డీ విటమన్ కోసమ