పిల్లల్ని అవమానించకండి : సీఎం చంద్రబాబు

అమరావతి :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోషల్ మీడియా ద్వారా పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యే పదోతరగతి ప‌రీక్షా ఫలితాల్లో.. మీ పిల్లల రిజల్ట్స్ ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరమన్నారు. పిల్లలను తిట్టడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయొద్దని సలహా ఇచ్చారు సీఎం. వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి.  పిల్లలకు మీరు ధైర్యం చెప్పండి. ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదనీ… కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కల్గించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.