ఎవరు ముందు మాట్లాడాలి ? జనం ముందే కొట్లాట !! (Vedio)

నేను సీనియర్ ని నేనే ముందు మాట్లాడాలి !
నేను స్టార్ క్యాంపెయినర్ ని నేనే మాట్లాడాలి !!

ఇది కాంగ్రెస్ పార్టీ వరస. జనం ముందే రోడ్ షోల్లో ఇద్దరు నేతలు గొడవ పెట్టుకున్నారు. గట్టిగా వాదించుకున్నారు… రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. అసలే టీఆర్ఎస్ బహిరంగ సభలు, రోడ్ షోలతో దూసుకుపోతుంటే… ఇప్పుడిప్పుడే మెల్లగా రోడ్లు ఎక్కిన కాంగ్రెస్ నాయకులు…. ఇలా వాదులాడుకుంటున్నారు.

గజ్వేల్ కాంగ్రెస్ రోడ్ షోలో ఎవరు ముందు మాట్లాడాలన్న దానిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మధ్య మాటల యుద్ధం నడిచింది. నడిరోడ్డుపై ప్రచార రథంలోనే నేతలు ఇద్దరు పరస్పరం వాగ్వాదానికి దిగారు. దాంతో వీళ్లకి సర్ది చెప్పడానికి స్థానిక నేతలు నానా కష్టాలు పడ్డారు. చివరకు సీనియర్ నేత వీహెచ్ కే అవకాశం కల్పించారు. దాంతో విజయశాంతి చిన్నబుచ్చుకుంది.

వీహెచ్, విజయశాంతి గొడవ కోసం ఈ వీడియో చూడండి