2018లో భారత్ లో గంటలకు 1.4లక్షల మంది ఆన్‌లైన్‌ అకౌంట్స్‌పై దాడి చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వాళ్ళ ఖాతాల యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్ దొంగిలించడానికి ఈ దాడులు జరుగుతున్నట్టు గుర్తించారు. ఇలాంటి సైబర్ ఎటాక్స్ ఎక్కువగా మీడియా సంస్థలు, గేమింగ్ కంపెనీలు, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలపైనా హాకర్స్ ఈ దాడులు చేస్తున్నారు. స్ట్రీమింగ్ సైట్, గేమ్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు. బాట్ నెట్ గ్రూప్స్ ఈ దాడులకు ఎక్కువగా పాల్పడుతున్నట్టు సైబర్ నిపుణులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తమ్మీద గత ఏడాదిలో అమెరికాలోని 1252 కోట్లు, తర్వాత భారత్ లో 121కోట్లు, కెనడాలో 102 కోట్ల అకౌంట్స్ మీద దాడులకు ప్రయత్నించారు.