రజనీ కాంత్ ‘దర్బార్’

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. నెల రోజుల పాటు ప్రత్యేక సెట్ లో అక్కడ షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత చెన్నైలో చిత్రీకరిస్తారు. దర్బార్ సినిమాలో రజనీకాంత్ ఓ IPS అధికారిగా కనిపించబోతున్నారు. రజనీ పక్కన నయనతార నటిస్తోంది. ఇంకో పాత్రలో నివేదిత థామస్ కూడా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి దర్బార్ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అనిరుథ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.