వరల్డ్ కప్ లో ధోనీ ఉండటం మా అదృష్టం : కోహ్లీ

రాబోయే ప్రపంచ కప్ లో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండటం తమ అదృష్టమని అన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. సుదీర్ఘ కాలం వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ గా భారత జట్టుకి సేవలు అందించాడు. వికెట్ల వెనుక అతని సామర్థ్యం, కీలక సమయాల్లో ఉపయోగపడుతుందన్నాడు కోహ్లీ.

ధోనీ మొత్తం 341 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 10,500 పరుగులు చేశాడు. మ్యాచుల్లో అతని యావరేజ్ స్కోర్ 51. ప్రపంచ కప్ సమయానికి అతనికి 38యేళ్ళు వయస్సు ఉంటుంది. అయినప్పటికీ… జట్టులో కీ రోల్ పోషిస్తాడని చెబుతున్నాడు కోహ్లీ. 2011 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ కూడా కావడంతో అతని అనుభవం ఈ వరల్డ్ కప్ కి పనికొస్తుందని చెబుతున్నాడు కోహ్లీ. మొదటి పరుగు నుంచి 300 పరుగుల వరకూ గేమ్ పై ధోనీకి మంచి అవగాహన ఉంటుందని చెబుతున్నాడు.

వరల్డ్ కప్ లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. అక్కడి నుంచే ఇండియా ప్రస్థానం మొదలవుతుంది.