ధోనికి జరిమానా ఎందుకు పడిదంటే !

మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా పడింది. IPL యాజమాన్యం ఆర్టికల్ 2.20 ప్రకారం ధోనికి మ్యాచ్ ఫీజులో 50శాతం కోత విధించారు.

జైపూర్ లో గురువారం చెన్నై కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 155 పరుగుల టార్గెట్ గా బరిలోకి దిగిన చెన్నై చివర్లో 3 బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉంది. దాంతో క్రీజులో ఉన్న శాంట్నర్ కు రాజస్థాన్ బౌలర్ బెన్ స్టోక్స్ వికెట్ల కంటే ఎత్తులో బంతిని వేశాడు. దీన్ని అంపైర్లు మొదట నో బాల్ గా ప్రకటించారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు ఎంపైర్లు ఉలాస్ గాందే, బ్రూస్ ఆక్స్ ఫర్డ్. దాంతో అవేశంతో గ్రౌండ్ లోకి వచ్చిన ధోనీ… అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దాంతో ధోనీపై జరిమానా విధించింది IPL యాజమాన్యం.