మీకు క్యాష్  బ్యాక్  కార్డు కావాలా ? కేటుగాళ్ళ కొత్త కొత్త ప్లాన్స్ !

సైబర్ నేరాలు ఇప్పుడు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. ఎప్పుడూ ఒకే తరహా మోసం చేస్తే జనం గ్రహిస్తారని… కేటుగాళ్ళు రూటు మారుస్తున్నారు. రక రకాలుగా ప్రలోభాలు పెట్టి మన క్రెడిట్ కార్డులు, బ్యాంకు బ్యాలెన్సుల్లో అమౌంట్స్ నొక్కేస్తున్నారు.

ఇటీవల ఓ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇలాంటి మోసగాళ్ల మాయ మాటలతో రూ.20వేలు పోగొట్టుకున్నారు. ఇది మన teluguword టీమ్ దృష్టికి వచ్చిన సంఘటన. ఇలాంటివి ప్రతి రోజూ ఎన్నో జరుగుతున్నాయి.

బాధితుడికి SBI క్రెడిట్ కార్డు ఉంది. ఢిల్లీ నుంచి ఓ కాల్ వచ్చింది. నేను SBI క్రెడిట్ కార్డు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఫలానా… అని చెప్పాడు. అంతేకాదు.. ఇంకా నమ్మించడానికి… అతని ఎంప్లాయ్ ఐడీ నెంబర్ కూడా చెప్పాడు. ఓహో… నిజంగానే SBI ఎంప్లాయి మాట్లాడుతున్నాడని బాధితుడు నమ్మేశాడు. మీకు కొత్తగా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఇస్తాము. దాంతో మీరు ఎక్కడ ఏమి కొన్నా… క్యాష్ బ్యాక్ వస్తుందని నమ్మబలికాడు. అందుకోసం మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని కోరాడు. ఓకే అన్నాక… మీ క్రెడిట్ కార్డు నెంబర్ ఎవరికీ చెప్పకూడదు… నేను చెప్పిన తర్వాత మీ మొబైల్ లో డయల్ చేయండి… అలాగే.. CVV కోడ్ కూడా ఎవరు అడిగినా చెప్పకండి… మా SBI ఉద్యోగులు అడిగినా సరే… అన్నాడు. దాంతో బాధితుడికి వచ్చిన కాల్ మీద ఇంకా గురి ఏర్పడింది. ఆ తర్వాత కేటుగాడు చెప్పినట్టే… క్రెడిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి… CVV కూడా కూడా నొక్కాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు మెస్సేజ్ లు వచ్చాయి… రూ.4999లు కట్ అయినట్టు… దాంతో దాదాపు 20 వేల దాకా క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం ద్వారా డ్రా అయిపోయాయి. ఇదేంటి డబ్బులు కట్ అవుతున్నాయని అడిగితే… నాకు ఎర్రర్ మెస్సేజ్ వస్తుంది… ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని నమ్మబలికాడు… ఆ కేటుగాడు. కాల్ కట్ అయ్యాక తెలిసింది… దాదాపు 20వేలు చోరీ అయ్యాయని… ఆ తర్వాత ఆ మొబైల్ నెంబర్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

ఇలా కాల్సే కాదు… ఫేక్ మెస్సేజ్ లు కూడా వస్తున్నాయి… కార్డ్ అప్ గ్రేడ్ చేసుకోడానికి లేదంటే మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాలంటే ఈ మెస్సేజ్ లింక్ నొక్కమని కూడా అడుగుతున్నారు కేటుగాళ్ళు. బీ కేర్ ఫుల్… మీరు ఇలాంటి ఫేక్ మెస్సేజ్ లు, కాల్స్ నమ్మకండి… మీకు నిజంగా బ్యాంక్ తో పని ఉంటే… నేరుగా కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి వివరాలు తీసుకోండి… లేదా ఆ బ్యాంక్ కు చెందిన నిజమైన యాప్స్ లేదా వెబ్ సైట్స్ లో రిక్వెస్ట్ పెట్టండి. అంతేకానీ బ్యాంక్ ఉద్యోగుల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ అస్సలు నమ్మొద్దు. ఫ్రెండ్స్ జాగ్రత్త… ఏ బ్యాంకు వాళ్ళు కూడా ఇలాంటి కాల్స్ చేయబోరని … తమ ఖాతాదారులకు మెస్సేజ్ లు కూడా పంపుతున్నారు.

Please like Face Book page:

https://www.facebook.com/Telugu-word-862539437419486/