గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారా ?

ఈమధ్య కాలంలో గ్యాస్ ట్రబుల్ తో చాలామంది బాధ పడుతున్నారు. కడుపులో మంట, పులి త్రేన్పులు, ఆపాన వాయువులు, అన్నం తినాలని అనిపించకపోవడం లాంటి సమస్యలు చాలామందిలో ఉన్నాయి. వీటికి తోడు తలనొప్పి, నిద్ర రాకపోవడం, నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు, నిద్రలో గురక లాంటి సమస్త రోగాలకు ఒక్కటే మందు హరితకి రసాయనం.
సమస్త ఉదర సంబంధమైన వ్యాధులకు పనికివచ్చే ఈ హరితకి రసాయనాన్ని మీరే తయారు చేసుకోవచ్చు.

ఎలా తయారు చేసుకోవాలి ?

చిన్న కరక్కాయపొడి – 50 గ్రాములు

సోంపు గింజల పొడి – 10 గ్రాములు

జీల కర్ర పొడి – 10 గ్రాములు

అల్లపు రసం – ఒక చెంచా

నిమ్మ రసం – ఒక చెంచా

సైంధవ లవణం – 10 గ్రాములు

అన్ని పదార్థాలు బాగా కలిపి, దంచి గాలి తగిలే చోట ఆరబెట్టాలి ( రెండు రసాలు తక్కువగా ఉన్నచో 2,3 చెంచాలు ఎక్కువ కలుపుకోవచ్చు ). మరలా దంచి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఎవరికి వారు దాన్ని చిన్న డబ్బాలో దాచుకొని జేబులో పెట్టుకోవాలి. దాన్ని రోజులో రెండు, 3 సార్లు చప్పరిస్తూ ఉండాలి. ఈ ఔషధం వేసుకున్న రోజు నుంచే గ్యాస్ నివారణ మొదలవుతుంది.  పైన చెప్పిన వ్యాధులన్నీ 11 రోజుల్లోనే తగ్గిపోతాయి. నిత్యం వాడితే ఇక ఎలాంటి ఢోకా ఉండదు.

( ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు : GVM Sharma, ఆయుర్వేద కార్యకర్త, ఖమ్మం. 9441877485 )