అవును… ఇది అక్షరాలా నిజం… గూగుల్ మీ సీక్రెట్స్ అన్నీ కనిపెట్టేస్తోంది. మీరు ఉదయం మెయిల్స్ చూసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి రూట్ మ్యాప్స్, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసే వీడియోలు… ఇలా ప్రతి విషయాన్ని గూగుల్ పసి గడుతోంది. మీకు తెలిసో… తెలియకో… మీరు లాగిన్ అయిన ప్రతిసారీ, సెర్చ్ చేసిన ప్రతి సారీ… గూగుల్ కి సమాచారం వెళ్లిపోతోంది.

గూగుల్ మీ డేటాని రెండు విధాలుగా కలెక్ట్ చేస్తుంది. మీరు జీమెయిల్ ద్వారా సైనిన్ చేసినా… గూగుల్ లో సమాచారం కోసం వెతికినా మీ ప్రవర్తను కనిపెట్టేస్తుంది. అలాగే కొన్ని సార్లు వినియోగదారులకు తెలియకుండానే బ్యాక్ ఎండ్ లో కొన్ని గూగుల్ యాప్స్ పనిచేస్తుంటాయి. మీరు గమనించారో లేదో మీరు యాప్స్ లో ఏదైనా వస్తువు కొనాలని వెతికారనుకోండి… ఆ తర్వాత ఆ వస్తువుకి సంబంధించిన యాడ్ ప్రతి యాప్ లేదా వెబ్ సైట్ లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఇలా యాడ్స్ పంపిస్తూ… గూగుల్ తన రెవెన్యూలో 80శాతం ప్రకటనలతోనే సంపాదిస్తోంది.

మీరు మెట్రో స్టేషన్ కు వెళ్తారు… అక్కడ ట్రైన్ పట్టుకొని ఆఫీసుకు వెళ్తుంటారు. ఆ తర్వాత న్యూస్ చూస్తారు. మ్యూజిక్ వింటారు, యూట్యూబ్ లో వీడియోలు చూస్తారు. ఇవన్నీ గూగుల్ డేటాలో నిక్షిప్తమై ఉంటాయి. మీరు మొబైల్ లో లోకేషన్ ఆన్ చేస్తే చాలు… జీపీఎస్ ద్వారా మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందీ గూగుల్ కి తెలిసిపోతుంది. అలాగే న్యూస్ కోసం గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు మీరు ఎలాంటి వార్తలు చూస్తారన్నది కనిపెడుతుంది. ఇక మీరు యూట్యూబ్ చూస్తే ఎంత టైమ్ ఆ వీడియో చూశారు… సాధారణంగా ఎలాంటి వీడియోలు చూస్తారన్నది రికార్డు చేస్తుంది.

మీరు గూగుల్ పే ద్వారా లంచ్ కోసం బిల్లు పే చేస్తే… అసలు మీకు ఏ ఆహారపదార్థాలు ఇష్టం… వేటిని తరుచుగా కొనుగోలు చేస్తారు, ఎన్ని ఐటెమ్స్ కొంటారు… ఎక్కువగా ఏ హోటల్ లో కొంటారు… ఇలాంటివి సేకరిస్తుంది… ఆ తర్వాత అలాంటి టార్గెటెడ్ యాడ్స్ ని మీకు తరుచుగా చూపిస్తుంది. ఇవే కాదు… మీ మెయిల్స్ కూడా గూగుల్ స్కాన్ చేస్తుంది.

ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రజలు గూగుల్ సెర్చ్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. దాదాపు 180 కోట్ల మంది యూట్యూబ్ ని వాడుతున్నారు.

సో… మన జాతకం మొత్తం జ్యోతిష్యుడి చేతిలో కాదు….. గూగుల్ దగ్గర ఉందన్నమాట…

ఫ్రెండ్స్

న్యూస్ మరియు వ్యూస్ కోసం www.teluguword.com
ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి:

https://www.facebook.com/Telugu-word-862539437419486/

వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/FRrtORES8UN31fGMXmrXzm

టెలిగ్రామ్ లింక్
https://t.me/teluguwordnews