హార్దిక్, రాహుల్ కి చెరో రూ.20 లక్షల జరిమానా !

భారత క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కి భారీ షాక్ ఇచ్చారు BCCI అంబుడ్స్ మన్ డీకే జైన్. చెరో 20 లక్షల రూపాయల జరిమానా విధించారు.

కరణ్ జోహర్ టీవీ షో అయిన కాఫీ విత్ కరణ్ లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఇద్దరు క్రికెటర్లపై BCCI అంబుడ్స్ మన్ ఈ జరిమానా విధించారు. అమరులైన 10మంది పారామిలటరీ సైనికుల భార్యలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇద్దరూ చెల్లించాలి. చెరో 10 లక్షలతో బ్లైండ్ క్రికెట్ అభివృద్ధికి నిధిని డొనేట్ చేయాలని ఆదేశించారు.
నాలుగు వారాల్లో ఆ మొత్తాన్ని చెల్లించకపోతే… వాళ్ళ మ్యాచ్ ఫీజుల్లో నుంచి ఆ అమౌంట్ కోత విధించాలని అంబుడ్స్ మన్ ఆదేశించారు.