తల బాధలు ఇలా తప్పుతాయ్ !

తలకు సంబంధించిన నుదురు నొప్పి, కన్ను బొమ్మల నొప్పి, మాడు నొప్పి, మెడ నొప్పి, తలలో వాయు భారం, శ్లేష్మ భారం తగ్గిపోయి శిరస్సు ఆరోగ్యవంతంగా మారుటకు శిరో మంజరి రసాయనం. ఇది భార్గవ మహాముని ప్రయోగంగా చెబుతారు.

తయారు చేసుకునే విధానం

శొంఠి పొడి 20 గ్రాములు

బెల్లం – 80 గ్రాములు

ఆవునెయ్యి -80 గ్రాములు

స్వచ్ఛమైన పాలు – 320 గ్రాములు

ఒక పాత్రలో అన్ని పదార్థాలను కలిపి, పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై ఉంచాలి. అందులోని నీళ్ళంతా ఇనికిపోయేదాకా లేత పాకం రాగానే… దించి చల్లార్చి గాజు సీసాలో ఉంచుకోవాలి. ఈ రసాయనాన్ని ఆహారానికి గంట ముందు 10 గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే… పైన చెప్పిన రోగాలన్నీ మటుమాయం అవుతాయి. 21 రోజు ఈ ప్రక్రియ కొనసాగించిన శిరస్సుకు సంబంధించిన వ్యాధులు పూర్తిగా నివారణ అవుతాయి.

ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు

(తయారు చేసుకోలేని వారికి రెడీ మేడ్ ఔషధాలు దొరుకు చోటు) :

GVM Sharma, ఆయుర్వేద కార్యకర్త,

 శ్రీ భరద్వాజ మహర్షి ఆయుర్వేద ఔషధాలయం,

ఖమ్మం. 9441877485