ఈనెల 21 నుంచి ఇంటర్ అడ్మిషన్స్

తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో ఈనెల 21 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ మొదలవుతాయి.  జూన్ ఒకటి నుంచి తరగతులు మొదలవుతాయని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ప్రకటించారు.  జులై ఒకటికి మొదటి విడత అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. ప్రైవేట్ కాలేజీల్లో బోర్డు అనుమతించిన దానికన్నా మించి అడ్మిషన్స్ తీసుకోరాదని అధికారులు హెచ్చరించారు.  ఒక్కో సెక్షన్ లో 88 మంది మాత్రమే ఉండాలి. వీటిల్లో 33 శాతం బాలికలకు  రిజర్వేషన్లు పాటించాలి. అలాగే అదనపు సెక్షన్ లకు అనుమతి తీసుకున్నాకే విద్యార్థులను చేర్చుకోవాలని ప్రైవేటు కాలేజీలకు బోర్డు సూచించింది.  ప్రతి రోజు అడ్మిషన్స్ డిటెయిల్స్ ని కాలేజ్ నోటీస్ బోర్డ్ లో ఉంచాలని కోరింది.