18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు : బోర్డ్ అధికారిక ప్రకటన

ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల వెల్లడిపై ఉన్న ఉత్కంఠ తొలగిపోయింది. 2019 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను ఈనెల 18న వెల్లడి చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్మీడి యట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి, విద్యాభవన్, నాంపల్లి, హైదరాబాద్ లో ఈనెల 18న ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలపై గతంలో సోషల్ మీడియాలో వివిధ తేదీలు రావడంతో… ఎట్టకేలకు ఖచ్చితమైన తేదీని బోర్డు ప్రకటించింది.