ఇంటర్ ఫలితాలపై ఊహాగానాలు నమ్మొద్దు !

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని ఇంటర్మీడిట్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. వివిధ పత్రికల్లో వేర్వేరు తేదీలు ప్రచురిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు అసౌకర్యం కలుగుతోందని అంటున్నారు. ఇంటర్ ఫలితాలపై ఇప్పటిదాకా బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. ప్రస్తుతం పేపర్లు దిద్దే కార్యక్రమం, ఇతర ఫలితాల ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి. ఇంటర్ ఫలితాలను ఎప్పుడు ప్రకటించేదీ… ఖచ్చితమైన ప్రకటనను బోర్డు అధికారికంగా ప్రకటిస్తుందనీ… అప్పటి దాకా వదంతులు నమ్మొద్దని తెలిపారు.

ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన కోసం చూడండి: