IPL ఫైన‌ల్‌కి ఉప్పల్ స్టేడియం రెడీ !

హైదరాబాద్ :

ఐపీఎల్ మానియాతో హైదరాబాద్ సిటీ ఊగిపోతోంది. ఈసారి ఫైనల్స్ వేదిక ఉప్పల్ స్టేడియం కావడంతో నగరంలో ఏ నలుగురు ఫ్రెండ్స్ కలుసుకున్నా దీనిపైనే చర్చ. పోటా పోటీగా జరిగిన లీగ్ మ్యాచుల్లో ఆధిక్యత కనబరచి…ముంబై, చెన్నై జట్లు ఫైనల్స్ కు చేరాయి. ఈ రెండు జట్లు కూడా బలమైనవి కావడంతో విజయం ఎవర్ని వరిస్తుందోనన్న టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠాలను కూడా పోలీసులు పట్టుకున్నారు.

ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం దగ్గర పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతోంది. స్టేడియం లోపల 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. స్టేడియం లోప ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం 2 వేల 800 పోలీసులు స్టేడియం దగ్గర బందోబస్తులో పాల్గొంటారు. నిషేధిత వస్తువులను స్టేడియంలోకి తీసుకురావొద్దని సీపీ వివరించారు.

క్రికెట్ మ్యాచ్ వెళ్ళే వాళ్ళు ఇవి తీసుకురావొద్దు

1) హెల్మెట్
2) పవర్ బ్యాంక్
3) సిగరెట్లు
4) ల్యాప్ ట్యాప్
5) మద్యం
6) ఫుడ్ ఐటెమ్స్
7) బయటి నుంచి నీళ్ళ బాటిల్స్