IPL-12 విజేత ముంబై ఇండియన్స్

హైదరాబాద్ :

ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన IPL 12వ సీజన్ ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఒక్క పరుగు తేడాతో రోహిత్ సేన విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకి 148 పరుగులు చేయగలిగింది. IPL లో 150 పరుగులు పెద్ద లక్ష్యమేమీ కాదు. అయినా ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో ఈ విజయం సాధ్యమైంది. విజేతగా నిలిచిన రోహిత్ సేనకి ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీగా రూ.20కోట్లు అందాయి. అలాగే రన్నరప్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కి రూ.12.5 కోట్లు దక్కాయి.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : బుమ్రా
ఆరెంజ్ క్యాచ్ : డేవిడ్ వార్నర్
పర్పుల్ క్యాచ్: ఇమ్రాన్ తాహిర్
వర్ధమాన ఆటగాడు: శుభ్ మన్ గిల్