పార్టీ ఫిరాయింపుదారులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా శాసనసభలో మొదటి ప్రసంగం చేసిన జగన్ ఫిరాయింపులను ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందనీ… తాము అలాంటి సాంప్రదాయం కొనసాగించబోమన్నారు. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారాలనుకుంటే… రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని చెబుతామన్నారు.

సరిగ్గా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించి అధికార పక్షంలో చేరిన టైమ్ లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ ఆసక్తికర చర్చ నడిచింది. అటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. స్పీకర్ గా సభ ఉన్నతిని కాపాడతానని అన్నారు. అప్పట్లో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలో కొందరికి టిక్కెట్లు దక్కలేదు. అలా దక్కించుకున్న వారిలో ఒకే ఒక్కరు మాత్రమే గెలిచారు.

తెలంగాణలో ఫిరాయింపులపై రాద్దాంతం జరుగుతున్న టైమ్ లో ఏపీ అసెంబ్లీలో చర్చ నడవటం… రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని ఏపీ స్పీకర్ కూడా పిలుపునివ్వడం రెండు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది.