జ్యూయలరీపై ఈడీ దాడులు: రూ.82 కోట్ల బంగారం స్వాధీనం ?

హైదరాబాద్ లోని ముసాదీ లాల్ జ్యూయలరీలో మరోసారి ఈడీ సోదాలు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ సోదాలను నిర్వహించారు అధికారులు. 82 కోట్ల విలువైన 145 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.  యజమాని కైలాష్ గుప్తా ఇంటితో పాటు ఆఫీస్ ల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు.  హైదరాబాద్, విజయవాడల్లో కూడా సోదాలు కొనసాగాయి.  యజమాని కైలాష్ గుప్తా తో పాటు మరో నలుగురు భాగస్వాముల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. నోట్ల రద్దు సమయంలో 110 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు ఈడీ అధికారులు.  5 వేల మంది కష్టమర్ల దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకున్నట్టు అప్పట్లో బయటపడింది.