టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో ఇప్పుడు బ్రాండ్ బాండ్ లోనూ సంచలనాలు సృష్టించబోతోంది. నెలకు రూ.600కే బ్రాడ్ బ్యాండ్, ల్యాండ్ లైన్ ఫోన్, టెలివిజన్ కనెక్షన్స్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఈ జియో గిగా ఫైబర్ సేవలకు ఢిల్లీ, ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వా దేశంలోని 1100 పట్టణాలకు విస్తరించబోతున్నారు.

వన్ టైమ్ డిపాజిట్ కింద రూ.4500 వసూలు చేస్తారు. ఇందులో ముందుగా 100 గిగా బైట్స్ ఇంటర్నెట్ డేటా, 100mbps వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తారు. వచ్చే 3నెలల్లో ఈ కనెక్షన్ కు టెలిఫోన్, టెలివిజన్ సేవలు కూడా యాడ్ చేస్తారు. ఈ సేవలన్నీ ఏడాదిపాటు ఉచితంగా అందించనుంది జియో సంస్థ. కంపెనీ కమర్షియల్ కార్యకలాపాలు ప్రారంభించే వరకూ వీటిని ఉచితంగానే ఇస్తారు. Unlimited కాల్స్ తో ల్యాండ్ లైన్ ఫోన్, ఇంటర్నెట్ (IPT) ద్వారా టెలివిజన్ ఛానెల్స్ అందిస్తారు.

ఇంకో ముఖ్య విషయం ఏమంటే… జియో ఇచ్చే రూటర్ తో మొత్తం 45 పరికరాలను లింక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్ ట్యాప్ లు, ట్యాబ్ లు… ఇలాంటివన్నీ అనుసంధానం చేసుకోవచ్చు.