స్టాలిన్ తో సీఎం KCR భేటీ !

TRS అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమిళనాడులో పర్యటిస్తున్నారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. స్టాలిన్‌ సాదరంగా కేసీఆర్‌కు స్వాగతం పలికారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించడంతో పాటు ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతానికి సహకరించాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో కాంగ్రెస్‌, భాజపాయేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటున్నారు కేసీఆర్. అందులో భాగంగానే స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో TRS ఎంపీలు వినోద్‌కుమార్‌, సంతోశ్‌ కుమార్‌.. డీఎంకే ఎంపీలు దురైమురుగన్‌, టీఆర్‌ బాలు పాల్గొన్నారు.

ఆదివారం ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లిన కేసీఆర్‌ శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా 10 రోజుల టైమ్ ఉంది. దాంతో కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయంగా  సమాఖ్య కూటమిని ఏర్పాటు చేసేందుకే కేసీఆర్ సీఎం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను స్వాగతించాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న డీఎంకే కూడా కేసీఆర్‌ అంశాలకు మద్దతిచ్చే అవకాశముంది. ప్రాంతీయ పార్టీల అవసరాలను తెలియజేయడం ద్వారా మద్దతు కూడగట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.