కోవ లక్ష్మీ ఏకగ్రీవంపై వివాదం

కుమ్రం భీం జిల్లా జైనూర్ జెడ్పిటిసిగా కోవ లక్ష్మీ ఏకగ్రీవంపై వివాదం ముదురుతోంది. తన భర్త శేకును కోవ లక్ష్మి అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని బిజెపి అభ్యర్థి చంద్రకళ బాయి ఆరోపించారు. జైనూర్ జడ్పీటీసీ ఏకగ్రీవాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించకపోతే భార్యాభర్తలు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బీజేపీ అభ్యర్థి బెదిరించారు.  గతంలో కాంగ్రెస్ అభ్యర్థిని కూడా బలవంతంగా విత్ డ్రా చేయించారని కోవ లక్ష్మీపై ఆరోపణలు వస్తున్నాయి.