హమ్మయ్య… రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రభుత్వంలో కాస్త కదలిక కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో పాటు 18 మంది కేబినెట్ టీమ్ ఉండటంతో… ఇప్పుడు జిల్లాల్లో బిజీ బిజీ అయ్యారు.
కేసీఆర్ ఫస్ట్ టర్మ్ కేబినెట్ లో మంత్రులు చాలా యాక్టివ్ గా ఉండేవారు. జిల్లాల్లో తిరుగుతూ…. నిత్యం ప్రజల్లో ఉండటమే కాదు… అధికారులతో తరుచుగా సమీక్షలు జరుపుతుండే వారు. కానీ సెకండ్ టర్మ్ లో బాధ్యతలు చేపట్టిన మంత్రులు జిల్లాల్లో పెద్దగా తిరిగింది లేదు… అధికారులతో సమీక్షలు జరిపినట్టు కూడా కనిపించలేదు. మొన్న మొన్నటి దాకా అసలు రాష్ట్రంలో మంత్రి వర్గం ఉందా అన్న విమర్శలు కూడా వచ్చాయి.

కేబినెట్ లోకి తాజాగా కేటీఆర్, హరీష్ రావు రావడంతో మిగతా మంత్రులకు కాస్త ఉత్సాహం వచ్చినట్టయింది. కొత్త అమాత్యులుగా బాధ్యతలు చేపట్టిన తెల్లారే… కేటీఆర్ GHMC లో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఫస్ట్ టైమ్ మినిస్టర్ అయిన పువ్వాడ అజయ్ … ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో తనిఖీలు చేశారు. ఇక ఈమధ్యకాలంలో నుంచే కాస్త బిజీగా ఉన్న ఈటల రాజేందర్ … జ్వరాలు, డెండీ వ్యాధులపై హాస్పిటల్స్ లో సమీక్షలు చేస్తున్నారు. రోగులతో మాట్లాడుతున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు.

ఇక జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ఇలా మంత్రులంతా మంగళవారం నాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తిరుగుతూనే ఉన్నారు.
కేబినెట్ లో యాక్టివ్ నెస్ ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు జనం.