రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడా ఫోన్ … ప్రస్తుతం దేశంలో ఈ మూడు టెలికాం ఆపరేటర్స్ లీడింగ్ లో ఉన్నాయి. డేటా, గుడ్ నెట్ వర్క్, కాలింగ్, మెస్సేజింగ్ లో వినియోగదారులకు రక రకాల బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళని ఆకట్టుకుంటున్నాయి. తమ ప్లాన్స్ సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే టెలికాం రంగంలోకి జియో రాకతోనే పోటా పోటీగా మిగతా సంస్థలు కూడా వినియోగదారులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతకుముందు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండేది. ఇప్పుడు వొడా ఫోన్, ఎయిర్ టెల్, జియో ఇప్పుడు రోజుకి రూ.300 ప్లాన్ లోనే 2GB డేటాను అందిస్తున్నాయి.

ఎయిర్ టెల్ ప్లాన్స్ ఓసారి చూద్దాం

ఎయిర్ టెల్ రూ.249 ప్రీ పెయిడ్ ప్లాన్

రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ లో ఎయిర్ టెల్ రోజుకి 2జీబీ 4G లేదా 3G డేటాని అందిస్తోంది. దీని కాలపరిమిది 28 రోజులు. ఇందులో 100 డైలీ SMSలు, అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ యొక్క డిజిటల్ యాప్స్ అయిన ఎయిర్ టెల్ టీవీ, Wynk ని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్ టెల్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

ఇందులో కంపెనీ రోజుకి 1GB చొప్పున 84GB డేటాని అందిస్తోంది. 84 రోజులు వ్యాలిడిటీ. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజుకి 100 SMS లు వాడుకోవచ్చు.

ఎయిర్ టెల్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ లో ఎయిర్ లెట్ 4G హై స్పీడ్ కలిగిన 123జీబీ డేటాని అందిస్తుంది. రోజుకి 1.5GBని వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు ఉచితం. వ్యాలిడిటీ పీరియడ్ 82 రోజులు

ఇక జీయో ప్రీపెయిడ్ ప్లాన్స్ చూద్దాం

జియో రూ.198 ప్లాన్

ఇందులో జియో 4G డేటాని 56 GB అందిస్తుంది. రోజుకి 2GB డేటా వాడుకోవచ్చు. 28 రోజులు వాలిడిటీ. అన్ లిమిటెడ్ లోకల్, నేషనల్ వాయిస్ కాల్స్, ప్రతి రోజు 100SMS లు ఉచితంగా అందిస్తుంది. అలాగే కంపెనీకి చెందిన డిజిటల్ సర్వీసులు జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్ తదితర యాప్స్ ఉచితంగా వాడుకోవచ్చు.

జియో రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

దీనికింద జియో 4G హైస్పీడ్ డేటా 126 GBని ఉచితంగా అందిస్తుంది. డైలీ లిమిట్ 1.5 GB డేటా. జీయో డాట్ కామ్ వెబ్ సైట్ ప్రకారం అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 smsలు వాడుకోవచ్చు. అలాగే కాంప్లిమెంటరీగా జియో యాప్స్ ని వినియోగించుకోవచ్చు. కాలపరిమితి 84 రోజులు.

జియో రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ కింద 168 GB 4G డేటాని అందిస్తారు. రోజులో 2 జీబీ డేటా వాడుకోవచ్చు. 84 రోజుల వరకూ వ్యాలిడిటీ ఉంటుంది. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 smsలు వాడుకోవచ్చు. అలాగే కాంప్లిమెంటరీగా జియో యాప్స్ ని వినియోగించుకోవచ్చు.

ఇక రూ.500 లోపు వొడా ఫోన్ లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ చూద్దాం

రూ.255 ప్లాన్

4G or 3g డేటాని రోజుకి 2జీబీ చొప్పున వాడుకోవచ్చు. 28 రోజుల కాలపరిమితి. అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ రోజుకి 100smsలు ఉచితంగా అందిస్తోంది వొడా ఫోన్. ఇవి కాకుండా లైవ్ టీవీ, మూవీస్, టీవీ షోస్ ని వొడాఫోన్ ప్లే యాప్ లో చూడొచ్చు.

రూ.199 వొడా ఫోన్ ప్లాన్

ఇందులో భారత్ లోపల అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఉచితం. 42gb ఇంటర్నెట్ డేటా ఉచితం. రోజుకి 1.5GB డేటా 4G లేదా 3G డేటా ఉచితం. 28 రోజుల కాలపరిమితితో రోజుకి 100 SMS లు కూడా ఉచితం. ఇవి కాకుండా లైవ్ టీవీ, మూవీస్, టీవీ షోస్ ని వొడాఫోన్ ప్లే యాప్ లో చూడొచ్చు.

వొడా ఫోన్ రూ.458 ప్లాన్

ఇందులో అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఉచితం. రోజుకి 1.5GB 4G లేదా 3G డేటా ఉచితం. రోజుకి 100 SMS లు వాడుకోవచ్చు. వ్యాలిడిటీ 84 రోజులు.