ఈసారి సాధారణ వర్షపాతమే : వాతావరణ శాఖ

ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ముందస్తు అంచనాలను అధికారులు వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ రుతుపవనాలతో 96శాతం వర్షపాంత నమోదవుతుందని వాతారవణ శాఖ ప్రకటించింది. ఎల్ నినో పరిస్థితులు బలహీనంగా ఉన్నాయనీ… హిందూ, పసిఫిక్ మహా సముద్రాలపై పరిస్థితులను కూడా అంచనా వేస్తున్నట్టు IMD తెలిపింది. 5శాతం అటు ఇటూగా పరిస్థితులు ఉంటాయంటోంది. మొత్తమ్మీద చూసుకుంటే 2019 రుతుపవనాలు ఖరీఫ్ సీజన్ రైతులకు లాభదాయకంగానే ఉంటుందని అంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ వర్షపాతం ఉంటుందని IMD అధికారులు అంచనా వేశారు.