తెలుగు లో వస్తున్న డిగ్రీ కాలేజ్, ఏడు చేపల సినిమాలపై హైదరాబాద్ సీపీ కి ఫిర్యాదు చేశారు ప్రగతి సేన యువజనం సంఘం అధ్యక్షుడు ప్రదీప్.  విద్యార్థులను పక్క దారి పాటించేలా ఈ రెండు సినిమాలు ఉన్నాయని ఆరోపించారు.  ఈ రెండు సినిమాల్లో నగ్న దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో మహిళలపై అత్యాచారాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కంప్లయింట్ చేశారు ప్రదీప్.  ఈ రెండు సినిమాలను రిలీజ్ అవకుండా నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.