నామా గుర్తు సైకిలా ? పాపం ఇంకా కన్ఫ్యూజన్ ! (Vedio)

 

మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉండి… ఈమధ్యే తెలంగాణ రాష్ట్ర సమితిలో జాయిన్ అయిన నాయకులు పాత గుర్తులను మర్చిపోలేకపోతున్నారు. టీడీపీ సైకిల్ తొక్కీ… తొక్కీ… ఇప్పుడు ఒక్కసారే కారు ఎక్కేసిన నేతలు ఇంకా సైకిల్ నే గుర్తు పెట్టుకుంటున్నారు. అంతేకాదు… సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరుతున్నారు. మొన్నామధ్య… నామా నాగేశ్వరరావు కూడా ఖమ్మం జిల్లా ప్రచార సభల్లో ఇలాగే ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. సైకిల్ గుర్తుకే మీ ఓటు… అని అన్నారు… ఆ తర్వాత నాలిక్కరుచుకున్నారు. ఇప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఇలాగే సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి… నామా నాగేశ్వరరావుని గెలిపించాలని కోరారు. ఎంతైనా ఏళ్ళ తరబడి సైకిల్ పై తిరిగారు కదా… పాపం మర్చిపోలేకపోతున్నారు.

ఈ వీడియో చూడండి…! సండ్ర ఎలా పొరపాటు పడ్డారో .. !!