పదేళ్ళలో 1150 మంది భద్రతా సిబ్బంది మృతి

2009 నుంచి ఇప్పటి దాకా నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్ లో 1150 పోలీసులు, భద్రతా సిబ్బంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడిచిన 7ఏళ్ల నుంచి ఈ సంఖ్య తగ్గుతోంది.
ఇప్పటికీ దేశంలో 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వం మాత్రం 2023 కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెబుతోంది. సమర్థవంతమైన ఇంటెలిజెన్స్, పటిష్టమైన సెక్యూరిటీ నెట్వర్క్ తో మావోయిస్టులను ఎదుర్కొంటున్నట్టు చెబుతోంది.