అన్ని బయోపిక్ సినిమాలు బంద్

దేశంలో అన్ని బయోపిక్ సినిమాలను ప్రదర్శించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలపై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గానీ సినిమా థియేటర్లలో గానీ ప్రదర్శించ రాదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆగిపోయిన సినిమాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్, పీఎం నరేంద్రమోడీ, ఉద్యమ సింహం ఉన్నాయి. రాజకీయ పార్టీలను ప్రభావితం చేసేలా లేదా అవమానించేలా ఉన్న ఎలాంటి కంటెంట్ ను ప్రసారం చేయొద్దని ఎలక్ట్రానిక్ మీడియాకి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు సినిమా థియేటర్లు, టీవీలు, ఇంటర్నెట్ బేస్డ్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియాకి కూడా వర్తిస్తాయి.

ఈసీ పూర్తి ఆదేశాలకు ఈ కింది pics చూడండి.