తెలంగాణలో కొత్త సర్పంచ్ లు పదవిలోకి వచ్చి దాదాపు మూడు నెలలు కావొస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా వాళ్ళకి చెక్ పవర్ ఇవ్వలేదు ప్రభుత్వం. దాంతో పదవిలోకి వచ్చినా… పంచాయతీ పనులు చేయలేక ఖాళీగా కూర్చుంటున్నారు సర్పంచ్ లు.

గ్రామపంచాయతీలకు పొద్దున లేచిన దగ్గర నుంచే ఎన్నో పనులు ఉంటాయి. చెత్త ఊడ్వటం దగ్గర నుంచి రోడ్లు వేయడం, వీధి దీపాలు, తాగునీరు, మురిగి కాల్వల శుభ్రం చేయడం ఇలా ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడానికి నిధులు కావాలి. పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు వేసవి కాలం రావడంతో దాదాపు ప్రతి గ్రామంలోనూ నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ట్యాంకర్లతో నీటిని సప్లయ్ చేయాల్సి ఉంటోంది.

ఎన్నికల్లో నిలబడ్ద దగ్గర నుంచీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు తమ పంచాయతీ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ నిధులు ఖర్చుపెట్టే అవకాశం లేకపోవడంతో జనానికి మొహం చూపించుకోలేకపోతున్నారు.  గ్రామాల అభివృద్ధికి కేంద్రం 14వ ఆర్థి సంఘం ద్వారా పంచాయతీలకు నిధులు ఇస్తుంది. గత నెలలో చిన్న పంచాయతీలకు వేలల్లో, మేజర్ పంచాయతీలకు లక్షల్లో నిధులు వచ్చాయి. వీటిల్లో ప్రతి పైసా ఖర్చు చేసే అధికారం గ్రామపంచాయతీకే ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ పైసా కూడా ఖర్చు కాలేదు.

చెక్ పవర్ ఎవరికి ఉంది ?

అసలు గ్రామపంచాయతీలో చెక్ ఎవరికి ఉంటుంది… గతంలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఉండేది. ఆ తర్వాత తెలంగాణ కొత్త గ్రామపంచాయతీ చట్టం వచ్చాక… సర్పంచ్, ఉప సర్పంచ్ కి కలిపి పవర్ ఇస్తామని ప్రతిపాదించారు. దాంతో గ్రామాల్లో పలుకుబడి ఉన్న చాలామంది చెక్ పవర్ వస్తుందన్న ఆశతో ఉప సర్పంచ్ లుగా పోటీ కూడా చేశారు. కానీ చెక్ పవర్ పై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కొత్తగా పంచాయతీ కార్యదర్శుల నియామకాలు కూడా పూర్తయ్యాయి. మరి సర్పంచ్ తో కలసి జాయింట్ చెక్ పవర్ ను ఉపసర్పంచ్ కి ఇస్తారా లేదా గ్రామపంచాయతీ కార్యదర్శికి ఇస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు.

ఎవరికి కలిపి జాయింట్ చెక్ పవర్ ఇస్తారో తొందరగా తేల్చాలని గ్రామపంచాయతీ పాలక మండళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. చెక్ పవర్ సమస్య తేలిపోతే.. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామనీ… ముఖ్యంగా ఈ వేసవిలో నీటి ఎద్దడి నుంచి బయటపడే చర్యలు తీసుకుంటామని కోరుతున్నారు సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు.

Friends,

Genuine న్యూస్ కోసం

Teluguword ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి:
https://www.facebook.com/Telugu-word-862539437419486/
వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/BIVy17lY3Ga7MIXNdQXjSB
టెలిగ్రామ్ లింక్
https://t.me/teluguwordnews