ఆంధ్ర, ఒడిశాపై ఫొని తుఫాన్ ఎఫెక్ట్

తీవ్ర పెను తుపానుగా మారిన ఫొని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా చూపనుంది. ఇప్పటికే బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్రతో పాటు కొన్ని జిల్లాల్లో తుఫాన్ ప్రభావం పడింది.  విశాఖ సహా తీర ప్రాంతాలు ఉన్న బీచ్ ల్లో కొన్ని చోట్ల అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. బీచ్ ప్రాంతాల్లో పర్యాటకులను ఏపీ పోలీసులు అనుమతించడం లేదు. విశాఖపట్నం జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఓపెన్ చేశారు.  ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.  ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో చెట్లు, విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. మామిడి కాయలు, అరటి తోటలపై పొని తుఫాన్ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ఒడిశాపై తీవ్ర ప్రభావం

ఫొని తుఫాన్ ఒడిశా వైపు దూసుకెళ్తోంది. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. దాంతో తీర ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు అధికారులు. ఒడిశాలోని 11 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఈసీ ఎత్తివేసింది.