ప్రశాంత్ కిషోర్…

ఈ పేరు పొలిటికల్ సర్కిల్స్ లో చాలామందికి తెలుసు… సామాన్య జనానికి కూడా చాలామందికి పరిచయం ఉన్న పేరు.  2014లో నరేంద్రమోడీ అధికారంలో రావడానికి … ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగ్మోహన్ రెడ్డికి పవర్ రావడానికి కూడా ఈయనే కారణం.  మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన పీకే కోసం ఈమధ్య పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ట్రై చేస్తున్నారు. అంతెందుకు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత ఓడిపోడానికి, అర్వింద్ గెలవడానికి కూడా పీకే టీమ్ నే కారణమని చెబుతున్నారు.  అందుకే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలంటే పీకే స్ట్రాటజీ బాగా పనికొస్తుందని బలంగా నమ్ముతారు మన రాజకీయ నాయకులు.

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే…

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా పనిచేసిన  ప్రశాంత్ కిషోర్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిట్టిన తిట్టు తిట్టకుండా నిప్పులు చెరిగాడు.  జగన్ తో పాటు పీకేని కూడా ఏకి పారేశాడు… కానీ జగన్ గెలుపులో ఆయన కీ రోల్ పోషించారన్న సంగతి కాస్త ఆలస్యంగానైనా గ్రహించారు చంద్రబాబు.  అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.  ఇందులో భాగంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తన తరపున పనిచేయమని చంద్రబాబు … పీకే టీమ్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.  ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ – ఐ పాక్ తో చర్చలు కూడా జరిపారని సమాచారం.  కొన్నేళ్ళ పాటు తమ కాంట్రాక్ట్ ని కంటిన్యూ చేద్దామంటూ బాబు భారీ ఆఫరే ఇచ్చారట.  కానీ మొన్నటి ఎన్నికల్లో  ప్రశాంత్ కిషోర్ ని బీహారీ బందిపోటు, ఆయన టీమ్ బీహార్ గ్యాంగ్ అంటూ… దుమ్మెత్తి పోసిన బాబుతో పీకే జత కట్టడం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. 2016 లోనే ఐపాక్ తో ఒప్పందానికి చంద్రబాబు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆ డీల్ సెట్ కాలేదు.   త్నాలు చేసినట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఐతే పీకే టీమ్ తో డీల్ సెట్ కాలేదని అంటున్నారు.

ఇక 2017 లోనే పీకే టీమ్ తో ఒప్పందం చేసుకున్నారు జగన్. ఆ తర్వాతే జగన్ పాదయాత్రకు పీకే ప్లాన్ చేశారు. వైసీపీ గెలుపులో కీ రోల్ పోషించింది ఈ యాత్రే అన్నది అందరికీ తెలిసిందే.  అలాగే నవరత్నాల పథకం, అభ్యర్థుల ఎంపికలోనూ పీకే ఐపాక్ టీమే కీలకంగా వ్యవహరించిందని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ విజయం తర్వాత… పీకే టీమ్ కి డిమాండ్ పెరిగింది.  పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు, తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ఐ పాక్ టీమ్ తో చర్చించారు.

మరి… ఏపీలో జగన్ పార్టీతో పీకే ఒప్పందం అయిపోయిందా…  బాబు – పీకే టీమ్ మధ్య కొత్త అగ్రిమెంట్ కుదురుతుందా అన్నది కొన్ని రోజులు పోతే గానీ తెలియదు.