అప్పుడు అర్హత …! ఇప్పుడు అనర్హత..!! పోలీస్ రిక్రూట్ మెంట్ లో విచిత్రాలు

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దేహదారుఢ్య పరీక్షలపై వివాదం ముదురుతోంది. 2016 లో ఫిట్నెస్ టెస్టుల్లో క్వాలిఫై అయిన వేలమంది  అభ్యర్థులు ఇప్పుడు అనర్హత పొందడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
దాదాపు లక్షన్నర మంది దాకా నష్టపోయినట్టు సమాచారం. గతంలో లేని విధంగా RFID విధానాన్ని TSRLPB ఇప్పుడు అమలు చేసింది. అయితే నియామకాలు పారదర్శకంగా జరిగేందుకు ఈ విధానం రూపొందించామని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. ఈ ఫిట్నెస్ టెస్టులను కంప్యూటర్స్ లో నిక్షిప్తం చేసే ఈ-సాఫ్ట్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడటంతో మొత్తం RFID వ్యవస్థ మీదే అనుమానాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో బయటపడ్డ అక్రమాలే ఇందుకు ఉదాహరణ.  ఐదుగురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

అయితే 2016లో పోలీస్ రిక్రూట్ మెంట్ సమయంలో దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన చాలామందిని ఇప్పుడు అనర్హులను చేసింది బోర్డు. అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉన్నా  ఫిజికల్ మెజర్ మెంట్స్ లో ఇప్పుడు తేడా ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు. అందుకు సాక్ష్యంగా మా www.teluguword.com వెబ్ సైట్ కి చాలామంది తమ ఫిట్నెస్ సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పంపారు.

పోలీస్ అభ్యర్థుల ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇవే:

కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఇదే అంశంపై ఆరోపణలు చేశారు. దేహదారుఢ్య పరీక్షలకు ఉపయోగించిన RFID సిస్టమ్ లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. 1.60 లక్షల మందికి ఈ సిస్టమ్ తో నష్టం జరిగిందని చెప్పారు. దీనిపై హోంమంత్రి, డీజీపీ, TSRLPB కి కంప్లయింట్ చేస్తామన్నారు. గతంలో వరంగల్ లో రెండు రోజుల క్రితం నల్గొండలో కూడా పోలీస్ అభ్యర్థులు ఈ వివాదంపై ఆందోళన చేశారు.

వరంగల్ లో మహిళా అభ్యర్థుల ఆందోళన pics

నల్గొండలో ఆందోళన చేసిన పోలీస్ ఉద్యోగార్థుల pics

అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా… అటు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మాత్రం RFID విధానంపై వివరణ ఇవ్వడం లేదు. గతంలో క్వాలిఫై అయిన వారు ఇప్పుడెందుకు డిస్ క్వాలిఫై అయ్యారో చెప్పడం లేదు. దాంతో అభ్యర్థుల్లో ఇంకా అనుమానాలు తొలగడం లేదు. పారదర్శకంగా రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నామని చెబుతున్న పోలీస్ ఉన్నతాధికారులైన ఈ అంశాలపై వివరణ ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.