ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం

మహబూబ్ నగర్:
కలెక్టరేట్ లో ప్రజావాణి జరుగుతుండగా యాదయ్య రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. ఇంతలో పోలీసులు అడ్డుకున్నారు. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లిలో తన 2 ఎకరాల పొలాన్ని అధికార పార్టీ నేత కబ్జా చేశాడని అంటున్నారు. ఎన్నిసార్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా… పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించానని చెప్పాడు యాదయ్య.