ముందస్తు ప్రిపరేషన్ ఎలా ?

మన పెద్దవాళ్ళు చెబుతుంటారు… రేపటి పని ఇవాళే చేయి… ఇవాళ్టి పని ఇప్పుడే చెయ్యి అని…

మనం ఈ కొటేషన్ ను చాలా సందర్భాల్లో లైట్ గా తీసుకుంటున్నాం. కానీ అందులో చాలా అర్థం ఉంది. ఈ కొటేషన్ ను మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కెరీర్ కు సంబంధించి అన్వయించుకుందాం. అప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది.
చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు చదువులు మొదలుపెట్టేద్దాం అని ప్లాన్ లో ఉన్నారు. అలా మన వెయిటింగ్ 3 లేదా 6 నెలలు పడుతోంది. అప్పటిదాకా అలానే వెయిట్ చేయడం మనలో చాలామందికి అలవాటు….

నో… ఇలాంటి విధానం నుంచి మీరు బయటపడింది. ఎప్పుడో నోటిఫికేషన్ పడ్డాక… 45 రోజుల టైమ్ ఇస్తే అప్పుడే ప్రిపేర్ అవుదామనే మీ ఆలోచనే… మిమ్మల్ని విజయం నుంచి దూరం చేస్తోంది. ఎందుకంటే అప్పుడు 45 రోజుల్లో అప్లయ్ చేయడానికి, బుక్స్ వెతుక్కోడానికి, వెతుక్కున్నాక వాటిని చదువుకోడానికి టైమ్ అంతా గడిచిపోతుంది. ఈలోగా ఎగ్జామ్ డేట్ వాయిదా పడితే బాగుండు… చాలా తక్కువ టైమ్ ఉంది కదా అనిపిస్తుంది. ఇక వాట్సాప్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియాలో ఎవరో ఒక పోస్టు పెడతారు… ఎగ్జామ్స్ వాయిదా వేయాలి… అని … వెంటనే దాన్ని మనం ఓ వంద మందికి ఫార్వార్డ్ చేస్తాం…. ఇవాళో వంద… రేపో వంద మందికి ఫార్వార్డ్ చేస్తాం… ఇలా వాయిదా మీద ఆలోచనతో కొన్నాళ్ళు గడిపేస్తాం… తీరా ఎగ్జామ్ డేట్ దగ్గర పడ్డాక… మళ్లీ హైరానా పడతాం… చదవడానికి టైమ్ సరిపోదు… కొన్ని రోజులు ఎగ్జామ్స్ నిర్వహించే బోర్డుని, గవర్నమెంట్ ను తిట్టుకుంటాం. ఈ మధ్యలో ఎవరైనా కోర్టుకి వెళ్లకపోతారా అని ఆలోచిస్తాం…

ఎందుకు ఇన్ని ఆలోచనలు ?

మనం ముందు నుంచే సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకున్నాం అనుకోండి… ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ వేసినా తెల్లారి ఎగ్జామ్ అంటే రాసేట్టుగా ఉండాలి. నువ్ హండ్రెడ్ పర్సంట్ కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ రాయి… అప్పుడు నీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది… లేదంటే అకడమిక్ ఎగ్జామ్ అయితే నువ్ తప్పక విజయం సాధిస్తావ్.

చాలామంది కోర్టు కేసులు లేదంటే పోస్టులు అమ్ముడు పోయాయి అంటూ ప్రభుత్వాన్ని నిందించుకుంటారు. ఇది కూడా తప్పే అంటాను నేను. నువ్ 100శాతం ఆత్మవిశ్వాసంతో… వందకి వంద మార్కులు వస్తాయి… అనుకొని ఎగ్జామ్ రాస్తే… టాప్ టెన్ లో నీ పేరు గ్యారంటీ… అప్పుడు నిన్ను కాకుండా వేరే వాడికి ఉద్యోగం ఎలా ఇస్తారు ? మనకి కోర్టులు ఉన్నాయి… మీడియా ఉంది… అంతకంటే ముఖ్యంగా సోషల్ మీడియా ఉంది…

అందుకే మీకు నచ్చినా… నచ్చకపోయినా… నేను చెప్పేది ఒక్కటే…

మీరు ప్రిపరేషన్ ను ముందస్తుగా మొదలుపెట్టండి…

ఎగ్జామ్ నోటిఫికేషన్ పడే నాటికి పుస్తకాలన్నీ తిరగేసి రెడీగా ఉండండి

ఎగ్జామ్ నోటిఫికేషన్ పడి… 45 రోజుల గ్యాప్ లో మీరు రివిజన్ చేసుకోండి…

లేటెస్ట్ అప్ డేట్స్, కరెంట్ ఈవెంట్స్ మీద పట్టు సాధించండి…

అప్పుడు విజయం మీ సొంతం అవుతుంది.

నేను యూట్యూబ్ క్లాసుల్లో ఆల్రెడీ మీకు ముందస్తు ప్రిపరేషన్ కోసం సిలబస్ ఛార్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను. ఆ క్లాస్ చూసి మీరు 3 నెలల టార్గెట్ పెట్టుకొని ఛార్ట్ ప్రిపేర్ చేసుకోండి… ఛార్ట్ ప్రిపరేషన్ కోసం కూడా ముహూర్తాలు చూసుకోకండి… పెద్దలు చెప్పినట్టు ఈ క్షణమే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టండి.

మన తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో నేను ఇచ్చిన సూచనలు పాటించి చాలామంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ సహా చాలా ఎగ్జామ్స్ లో విజేతలు అయ్యారు.

ఆల్ ది బెస్ట్
విష్ణుకుమార్ మేడుకొండూరు
సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్

please watch video & subscribe our Telangana Exams You Tube channel with the following Link.

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

ఎగ్జామ్ టైమ్ ఛార్ట్ ఎలా తయారు చేసుకోవాలో … ఈ వీడియో చూడండి