నిజం గుమ్మం దాటేలోపు… అబద్దం ఆరు ఊళ్ళు చుట్టి వస్తుందని … మన పెద్దలు చెబుతారు. ఇప్పటి కాలానికి ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుందేమో. సోషల్ మీడియా పుణ్యమాని… ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోకుండా… తెగ మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేస్తూ తామేదో దేశ సేవ చేస్తున్నామన్న ఫీలింగ్ మనలో చాలామందికి ఉంటోంది.

సరిగ్గా హైదరాబాద్ కి చెందిన సాగర్ విషయంలో ఇదే జరిగింది. ఇటీవల సాగర్ అనే స్టూడెంట్ హాస్పిటల్ లో ఉంటే… అతని పక్కన సెల్ఫీ వీడియో తీస్తూ…

‘‘హలో ఫ్రెండ్స్… ఇతను మా ఫ్రెండ్ సాగర్. అతని మెదడులో రక్తం గడ్డకట్టింది. అతను కొన్ని గంటలపాటు పబ్జీ గేమ్ ఆడటం వల్లే ఇదంతా జరిగింది. అతనికి కుడివైపు పెరాలసిస్ వచ్చింది. అందువల్ల పబ్జీ గేమ్ కి దూరంగా ఉండాలని అందరికీ మా విజ్ఞప్తి ’’ అంటూ 15 సెకన్లు ఉన్కన ఈ వీడియో కొన్ని లక్షల వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్స్ ఇతర సోషల్ మీడియాల్లో షేర్ అయ్యాయి. దురదృష్టవశాత్తూ గురువారం బండా సాగర్ యాదవ్ చనిపోయాక…చాలామంది సిటిజన్లు పబ్జీని నిషేధించాలని గట్టిగా డిమాండ్ చేశారు.

కానీ పబ్జీ గేమ్ కి బానిస అయితే నిజంగా చనిపోతారా… అని ఒక్కరు కూడా ఆలోచించలేదు. అసలు సాగర్ చనిపోయింది మాత్రం పబ్జీ గేమ్ వల్ల కాదని డాక్టర్లు క్లియర్ గా చెబుతున్నారు. అతనికి సీరియస్ గా ఇన్ఫెక్షన్ అవడంతో… ట్రీట్ ఇచ్చామనీ కానీ దురదృష్టవశాత్తూ చనిపోయాడని సాగర్ కి చికిత్స చేసిన డాక్టర్ రామ్ కిరణ్ ( Bristlecone Hospitals, Barkatpura) చెబుతున్నారు. పబ్జీ లేదా ఇతర ఏ గేమ్స్ వల్ల అతనికి డిసీస్ రాలేదంటున్నారు. అంతేకాదు… సాగర్ కి పెరాలసిస్ కూడా లేదని డాక్టర్ వివరించారు.

అయితే ఈ వీడియో ఎలా వచ్చిందనేది ఇప్పుడు అందరికీ డౌట్. ఈ వీడియో సాగర్ ఫ్రెండ్స్ సరదాగా తీశారట. బాధతో తీవ్ర ఇబ్బందులు పడుతూ.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తమ ఫ్రెండ్ ని నవ్వించడానికి, రిలాక్స్ కలిగించడానికి తీసిన వీడియో ఇది. ఇంత దారుణంగా సర్క్యులేట్ అవుతుందని ఊహించలేదని అంటున్నారు అతని మిత్రులు. అతను పబ్జీ ఆడటం వల్లే చనిపోయాడనేది కరెక్ట్ కాదని చెప్పారు. ఏ మొబైల్ గేమ్ అయినా అతిగా ఆడితే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది నిజమే అయినా… సాగర్ కి పబ్జీకీ సంబంధం లేకపోయినా… సరదాగా తీసిన ఫేక్ వీడియో మాత్రం ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంది.

దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలకి స్పందించకండి. సర్టిఫికెట్ పోయిందని ఒకరు, తప్పిపోయాడని ఒకరు, ఏదో కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యం ఉచితంగా చేస్తున్నారని ఇంకొకరు, ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారని మరొకరు… ఇలాంటి మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేస్తూనే ఉన్నారు. ఇందులో నిజమెంత ? అసలు ఆ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లేదా హాస్పిటల్ పాపులర్ అవడానికి ఫేక్ న్యూస్ ఇస్తున్నారా… అన్నది మీరు స్వయంగా ఫోన్ చేసి కనుక్కున్నాకే మెస్సేజ్ ఫార్వార్డ్ చేయండి.
కానీ అందులో … మనం ఎన్నో వేస్ట్ మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేస్తాం… నలుగురికీ సాయం చేసే ఇలాంటి మెస్సేజ్ పంపండి… అంటూ సందేశం ఇవ్వగానే ఆవేశపడిపోయి… నిజమా, అబద్దమా తేల్చుకోకుండా ఫార్వార్డ్ చేయొద్దు. ఇలాంటి ఫేక్ మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేస్తే… జైలుకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. జాగ్రత్త ఫ్రెండ్స్.

ఏ గేమ్ కి అయినా అడిక్ట్ అయి… గంటలు గంటలు ఆడితే మాత్రం… ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రహించండి. చదువుకునే టైమ్ లో చదువుకోవాలి… తర్వాత ఈ టైమ్ వేస్ట్ మీరు జీవితంలో ఎన్నో విలువైన అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

Please like Face Book page:

https://www.facebook.com/Telugu-word-862539437419486/

ఫ్రెండ్స్
News & Views కోసం www.teluguword.com

ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి:
https://www.facebook.com/Telugu-word-862539437419486/
వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/FRrtORES8UN31fGMXmrXzm
టెలిగ్రామ్ లింక్
https://t.me/teluguwordnews