రాహుల్ గాంధీకి ఊరట

ఢిల్లీ :

రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై ఊరట లభించింది.  రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కోట్టేసింది. బ్రిటిష్ పౌరసత్వం ఉన్న రాహుల్ ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని హిందూ మహాసభకు చెందిన కార్యకర్త పిటిషన్ దాఖలు చేశారు.  రెండు పౌరసత్వాలు కలిగి ఉండటంపై విచారణ జరపాలని పిటీషన్ లో కోరారు. సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది.